cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

తేజ్ ఓకె చేసిన మరో కథ

తేజ్ ఓకె చేసిన మరో కథ

సాయిధరమ్ తేజ్ ఫ్రస్తుతం విదేశాల్లో వున్నారు. ఈనెల 17 లేదా 19న ఇండియా వస్తారు. ఆ తరువాత మైత్రీ మూవీస్ చిత్ర-లహరి సినిమా షూట్ కు వెళ్లే అవకాశం వుంది. అయితే దాంతో పాటే మరో స్క్రిప్ట్ కు కూడా ఓకె చెప్పినట్లు తెలుస్తోంది. గోపీచంద్ మలినేని తయారుచేసిన స్క్రిప్ కు తేజ్ ఓకె అన్నట్లు బోగట్టా. అయితే డేట్ లు ఎప్పుడు? స్టార్ట్ ఎప్పుడు అన్నది తెలియాల్సి వుంది.

భగవాన్ పుల్లారావులకు గోపీచంద్ మలినేనితో ఓ సినిమాను తేజ్ చేయాలన్నది ఎప్పటి నుంచో ప్లాన్. కానీ అది మెటీరియలైజ్ కావడం ఆలస్యం అవుతోంది. బుర్రాసాయిమాధవ్, బెజవాడ ప్రసన్నలతో కలిసి గోపీచంద్ మలినేని తయారు చేసిన బౌండ్ స్క్రిప్ట్ కు తేజ్ ఇప్పటికి ఓకె అన్నాడని బోగట్టా. కాస్త మేసేజ్ తో కూడిన ఎంటర్ టైన్ మెంట్ సబ్జెక్ట్ ఇది అని తెలుస్తోంది.

మరి తేజ్ చిత్ర-లహరితో సమాంతరంగా ఈ సినిమా చేస్తారా? లేక దాని తరువాత చేస్తారా అన్నది చూడాలి. ఈ రెండుకాక గీతా బ్యానర్ లో కూడా ఓ సినిమా చేయాల్సి వుంది తేజ్. శైలజారెడ్డి అల్లుడు సినిమా తరువాత మారుతి అడ్డం పడకపోతే, గోపీచంద్ మలినేని సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం వుంది.