ఆ సినిమా బయటకు వస్తుందా?

చిన్న సినిమా పెద్ద హిట్ అయితే వెంటనే ఆ డైరక్టర్ కు ఓ చాన్స్ ఇవ్వడం అన్నది ఇటీవల టాలీవుడ్ ట్రెండ్ గా మారింది. ముఖ్యంగా కోటి రూపాయల లోపు సినిమా చేస్తే, పెద్ద…

చిన్న సినిమా పెద్ద హిట్ అయితే వెంటనే ఆ డైరక్టర్ కు ఓ చాన్స్ ఇవ్వడం అన్నది ఇటీవల టాలీవుడ్ ట్రెండ్ గా మారింది. ముఖ్యంగా కోటి రూపాయల లోపు సినిమా చేస్తే, పెద్ద బ్యానర్ లు వెంటనే చాన్స్ ఇచ్చేస్తున్నాయి. ఆ సంస్థల లెవెల్ కు కోటి రూపాయిలు అంటే పెద్ద మొత్తం కాదు. కానీ తీరా చేసి తొలిసినిమా గట్టెక్కించిన వీరులు మలి సినిమా దగ్గర చతికలపడిపోతున్న వైనాలు కూడా చాలా వుంటున్నాయి.

క్షణం సినిమాను కోటి రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించారు రవికాంత్ పేరపు. ఆ తరువాత ఆయనకు రామానాయడు స్టూడియోస్ నుంచి ఆఫర్ వచ్చింది. చిన్న సినిమా కొత్తవాళ్లతో చేయమని. పెట్టుబడి పెట్టారని వినికిడి. కానీ తీరా పూర్తయిన ప్రొడెక్ట్ ను చూసిన తరువాత పక్కన పెట్టారని తెలుస్తోంది.

సురేష్ బాబు తనకు పూర్తి సంతృప్తి వస్తే తప్ప, సినిమాను బయటకు వదలరు. ఆ మధ్య ఈ నగరానికి ఏమయింది సినిమాను కూడా అలాగే నెలల తరబడి వుంచారు. అదిగో సినిమా పరిస్థితీ అదే. ఇప్పుడు రవికాంత్ పేరపు సినిమా కూడా అలాగే రామానాయుడు స్టూడియోలో వుందని తెలుస్తోంది. మరి బయటకు ఎప్పటికైనా వస్తుందో? రాదో?