cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

మోక్షజ్ఞ లేటెస్ట్ ఫోటో ఎక్కడ?

మోక్షజ్ఞ లేటెస్ట్ ఫోటో ఎక్కడ?

నందమూరి మోక్షజ్ఞ. బాలకృష్ణ నట వారసుడు. దాదాపు రెండేళ్లుగా వార్తల్లో వుంటోంది మోక్షజ్ఞ సినిమా రంగం ఎంట్రీ. అంతకు మించి అంగుళం కూడా కదలలేదు. సరే, బాలయ్య కొడుకు కూడా హీరోనే కావాలన్న రూలు ఎక్కడాలేదు. అతనికి ఇష్టమైన కెరీర్ అతను ఎంచుకోవచ్చు. కానీ అసలు మోక్షజ్ఞ లేటెస్ట్ ఫొటో ఎక్కడ? సామాజిక మాధ్యమాల్లో మోక్షజ్ఞ నూనూగు మీసాల వయస్సు పొటోనే చలామణీ అవుతోంది.

అసలు ఆ మాటకు వస్తే, మోక్షజ్ఞ ఎక్కడా కనిపించడం లేదు. ఇంట్లో శుభకార్యాలు జరిగినపుడు కూడా మోక్షజ్ఞ కనిపించిన దాఖాల లేదు. స్వంత బావ లోకేష్ మంత్రి అయినపుడు మోక్షజ్ఞ కనిపించినట్లు ఒక్క ఫోటో కానీ వీడియో కానీ బయటకు రాలేదు. మొన్నటికి మొన్న నందమూరి హరికృష్ణ మరణిస్తే, దాదాపు ఆ ఫ్యామిలీ సభ్యులంతా కనిపించారు కానీ మోక్షజ్ఞ కనిపించలేదు.

ఆ మధ్య మోక్షజ్ఞ కొన్నాళ్లు  ఫిలింనగర్ ప్రాంతంలోని ఓ కేఫ్ కు రెగ్యులర్ గా వచ్చాడని వదంతులు అయితే వున్నాయి. ఆ సమయంలో చూసినవారు మోక్షజ్ఞను గుర్తు పట్టలేకపోయారని, బాగా వళ్లుచేసాడని గ్యాసిప్స్ వినిపించాయి. అలాగే ఏదో ట్రీట్ మెంట్ లకు కోసం విదేశాలకు వెళ్లాడని వార్తలు వెలువడ్డాయి.

కానీ ఎక్కడా ఒక్క లేటెస్ట్ ఫొటో మాత్రంలేదు. ఆఖరికి బాలయ్య అధికారిక పీఆర్వీ యూనిట్ కూడా పాత ఫోటోనే సోషల్ మీడియాలోకి వదిలింది. ఇదంతా చూస్తుంటే చాలా సీక్రెట్ గా వుంచి,ఒకేసారి హీరోగా మోక్షజ్ఞను జనాలకు చూపించి సర్ప్రయిజ్ చేయాలని ఆలోచిస్తున్నారేమో అని డవుట్ గా వుంది. లేక ఇంకేమన్నా వుందా? ఏమో?