cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

ఎన్టీఆర్ గురువుగా సునీల్

ఎన్టీఆర్ గురువుగా సునీల్

ఎన్టీఆర్ నోటి వెంట గురువుగారు.. గురువుగారు.. అన్న పదం వినిపిస్తే, గుర్తుకు వచ్చే సినిమా అదుర్స్. ఆ సినిమాలో బ్రహ్మానందం గురువు గారుగా, ఎన్టీఆర్ శిష్యుడిగా అద్భుతమైన కామెడీ పండించారు. మళ్లీ ఇప్పుడు అలాంటి కాంబినేషన్ ను త్రివిక్రమ్ శ్రీనివాస్ సెట్ చేసారు.

అరవింద సమేత వీరరాఘవ సినిమాలో సునీల్ మళ్లీ కమెడియన్ గా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాత్రకు సంబంధించి కొన్ని అప్ డేట్స్. ఈ సినిమా స్టార్ట్ టు ఎండ్ వరకు వుంటుందట. త్రివిక్రమ్ తన స్నేహితుడు సునీల్ కోసం ఎలాంటి పాత్ర తయారుచేసాడు అంటే సినిమాలో ఆల్ మోస్ట్ సునీల్ 90శాతం సీన్లలో కనిపిస్తాడట. ఆఖరికి ఓ డ్యూయట్ లో కూడా కనిపిస్తాడు అంటే అర్థం చేసుకోవచ్చు.

అన్నింటికి మించి, ఎన్టీఆర్ ఈ సినిమాలో సునీల్ ను గురువుగారు.. గురువుగారు అని పిలుస్తాడట. ఆ పిలవడంలో విరుపు, పంచ్ లు ఓ రేంజ్ లో వుంటాయని తెలుస్తోంది. మొత్తంమీద ఈ సినిమాలో సునీల్ మళ్లీ కామెడీ ట్రాక్ లో పడేలాగే వున్నాడు.