ప్రభాస్ మూవీ @150 కోట్లు

చూస్తుంటే పెద్ద హీరోలు ఎవ్వరూ ఇక మీడియం బడ్జెట్ సినిమాలు చేసేలా కనిపించడం లేదు. కనీసం బడ్జెట్ వందకోట్లు, కాస్త పీరియాడిక్ ఫిల్మ్ అయితే 150 కోట్లకు చేరిపోతోంది బడ్జెట్. తీసుకుంటున్న సబ్జెక్ట్ లు…

చూస్తుంటే పెద్ద హీరోలు ఎవ్వరూ ఇక మీడియం బడ్జెట్ సినిమాలు చేసేలా కనిపించడం లేదు. కనీసం బడ్జెట్ వందకోట్లు, కాస్త పీరియాడిక్ ఫిల్మ్ అయితే 150 కోట్లకు చేరిపోతోంది బడ్జెట్. తీసుకుంటున్న సబ్జెక్ట్ లు అలా వున్నాయి.

ఇక అసలు విషయానికి వస్తే ఈరోజు పూజ జరిగిన బాహుబలి ప్రభాస్ లేటెస్ట్ సినిమా బడ్జెట్ కూడా వందకోట్ల ఫైమాటే అని తెలుస్తోంది. ఈ సినిమా ఇటలీ బ్యాక్ డ్రాప్ లో జరిగే పీరియాడిక్ ఫిల్మ్. 1970 నాటి కథాంశం.

యేలేటి లైన్
దర్శకుడు యేలేటి చంద్రశేఖర్ ఇచ్చిన లైన్ ను జిల్ డైరక్టర్ రాధాకృష్ణ డెవలప్ చేసి కథగా మార్చారు. ఈ సినిమా 1970ల నేపథ్యంలో అదీ ఇటలీలో జరిగేకథ కావడంతో, ఇప్పుడు అక్కడ లోకేషన్లు తీసుకుని, షూటింగ్ కు అనుగుణంగా సెట్ లు వేసారట. ఈనెల 20 నుంచి 20 రోజల పాటు కంటిన్యూగా షూట్ వుంటుంది. అయితే ఇందులో ప్రభాస్ పాల్గొనే సీన్లు వుంటాయి కానీ తక్కువ.

ఇటలీలో ఇందుకోసం కాస్త భారీగా సెట్ లు గట్రా వేసారట. అక్కడ కూడా ఓ ఆఫీస్ పెట్టి, పనులు జరిపించినట్లు తెలుస్తోంది. పౌర్ణమి సినిమాలో ప్రభాస్ పాత గెటప్ లో కాస్త కనిపిస్తాడు. బెల బాటమ్ ఫ్యాంక్, కోర మీసం, టోపీ ఇలా. ఈ సినిమాలో కూడా అలాంటి గెటప్ కు దగ్గరగా వుండేలా ఏదో ట్రయ్ చేస్తున్నారు. మరీ ఎక్కువ జుట్టు, పెద్ద సైడ్ లాక్స్ కాకుండా, మధ్యేమార్గంగా ప్రభాస్ గెటప్ తయారుచేస్తున్నారు.

పూజాకు టెస్ట్ షూట్
ఇప్పటికే ఈ సినిమాకు పూజాహెగ్డేను హీరోయిన్ గా, మనోజ్ పరమహంసను సినిమాటోగ్రాఫర్, అమిత్ త్రివేదిని సంగీత దర్శకుడిగా, శ్రీకర్ ప్రసాద్ ను ఎడిటర్ గా ఫిక్స్ చేసారు. టోటల్ ప్రాజెక్టు డిజైనర్ రవీందర్. ఈ సినిమాలో గెటప్ కోసం, మరో రెండు రోజుల్లో టెస్ట్ షూట్ నిర్వహించబోతున్నారు.

ఇరవైరోజల ఇటలీ షూట్ తరువాత కాస్త గ్యాప్ ఇస్తారు. తరువాత ఇటలీలో ఇన్ సైడ్ తీయాల్సిన సీన్లు అన్నీ ఇక్కడ ప్లాన్ చేస్తారు. గ్యాప్ దొరికినపుడల్లా, సాహోతో సమాంతరంగా ఈ సినిమాను కూడా షూట్ చేస్తారు.