అల్లుడు కోసం వస్తున్న దేవ్-దాస్

శైలజారెడ్డి అల్లుడు సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ కు ఏర్పాట్లు షురూ అయ్యాయి. ఈ వీకెండ్ ఆదివారం అంటే ఈనెల 9న ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నారు. నిన్నటి వరకు ఎవరు చీఫ్ గెస్ట్ అన్నదాని మీద…

శైలజారెడ్డి అల్లుడు సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ కు ఏర్పాట్లు షురూ అయ్యాయి. ఈ వీకెండ్ ఆదివారం అంటే ఈనెల 9న ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నారు. నిన్నటి వరకు ఎవరు చీఫ్ గెస్ట్ అన్నదాని మీద కాస్త మల్లగుల్లాలు వున్నాయి. కొన్నాళ్ల క్రిందట ఎన్టీఆర్ అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన వచ్చే పరిస్థితుల్లో, వీళ్లు అడిగే వీలులేదు. అందువల్ల 'దేవ్-దాస్' లను గెస్ట్ లుగా పిలిచినట్లు తెలుస్తోంది.

ఈ నెలాఖరులో నాగ్-నానిల దేవదాస్ సినిమా విడుదల కాబోతోంది. శైలజారెడ్డి అల్లుడు హీరో నాగచైతన్య కాబట్టి, నాగ్ ఫంక్షన్ కు రావడంలో ఆశ్చర్యంలేదు. అయితే నాని కూడా వస్తున్నాడు. దీనికి రెండు కారణాలు. ఒకటి నాని సినిమా ఇదే సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో త్వరలో ప్రారంభం కాబోతోంది.

అంతేకాదు, నాని సినిమా కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయిన భలే భలే మగాడివోయ్ సినిమాను అందించిన మారుతినే శైలజారెడ్డి అల్లుడు దర్శకుడు. ఆ సినిమా విడుదలై ఈ నెలతో మూడేళ్లు పూర్తయింది. ఈ రెండు కారణాలతో నాని, తన కొడుకు సినిమా కాబట్టి నాగ్ వస్తున్నారు. ఆ విధంగా శైలజారెడ్డి అల్లుడు సినిమా కాస్తా, దేవదాస్ ప్రీరిలీజ్ ఫంక్షన్ మాదిరిగా మారుతుందేమో?