రవిశాస్త్రి రాసలీలలు.. అప్పట్లో ఆ హీరోయిన్!

ఒకవైపు ఇంగ్లండ్ టూర్ టెస్ట్ సీరిస్‌లో టీమిండియా చతికిల పడింది. గెలవాల్సిన మ్యాచ్‌లలో ఓటమిని మూటగట్టుకుని విమర్శల పాలవుతోంది. ఒక్క కొహ్లీ రాణింపు వల్ల టీమిండియా పరువు అంతో ఇంతో అయినా దక్కుతోంది. అయితే…

ఒకవైపు ఇంగ్లండ్ టూర్ టెస్ట్ సీరిస్‌లో టీమిండియా చతికిల పడింది. గెలవాల్సిన మ్యాచ్‌లలో ఓటమిని మూటగట్టుకుని విమర్శల పాలవుతోంది. ఒక్క కొహ్లీ రాణింపు వల్ల టీమిండియా పరువు అంతో ఇంతో అయినా దక్కుతోంది. అయితే కొహ్లీకి సరైన సహకరం లేకపోవడంతోనే టీమిండియా టెస్టు సీరిస్‌ను చేజార్చుకుంది. అదలా ఉంటే.. ఇంతలోనే టీమిండియా కోచ్ రవిశాస్త్రి ప్రేమాయణ వ్యవహారం తెరపైకి వచ్చింది.

నిమ్రత్ కౌర్ అనే నటీమణితో శాస్త్రి డేటింగ్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. సుదీర్ఘ పర్యటన కోసం శాస్త్రి ఇంగ్లండ్ వెళ్లాడు. అప్పటి నుంచి నిమ్రత్ కూడా అక్కడే ఉందని.. వీరిద్దరూ తరచూ కలుస్తున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. 56 యేళ్ల వయసులో శాస్త్రి కొత్త గ్రంథ సారంగం మొదలుపెట్టడం విశేషం.

టీమిండియా మాజీ కెప్టెన్, జగమెరిగిన కమెంటరేటర్, ప్రస్తుతం టీమిండియా కోచ్.. ఈ సెలబ్రిటీ తనకన్నా ఇరవై యేళ్ల చిన్న వయసు మగువతో ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్నాడట. రవిశాస్త్రి కొన్ని సంవత్సరాల నుంచి భార్యకు దూరంగా ఉంటున్నాడు. పదేళ్ల నుంచి వీరు వేర్వేరుగా ఉంటున్నారు. మధ్యలో విడాకుల పిటిషన్ దాఖలు చేసినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే విడాకులు ఖరారు కాలేదు.

ఇక ఈ మాజీ క్రికెటర్‌కు గతంలో కూడా ప్రేమాయణాలున్నాయి. అది కూడా బాలీవుడ్ హీరోయిన్ అమృతా సింగ్ తో రవిశాస్త్రి ప్రేమాయణం ఒకప్పుడు బాగా వార్తల్లో నిలిచిన అంశం. అమృతా సింగ్ తో శాస్త్రికి వివాహ నిశ్చితార్థం కూడా జరిగింది. ఎంగేజ్ మెంట్ తర్వాత వీళ్లు చాలాకాలం పాటు జంటగా విహరించారు.

అయితే తనకు హీరోయిన్ భార్యగా వద్దని స్టేట్ మెంట్ ఇచ్చి నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకున్నాడు శాస్త్రి. అనంతరం అమృతా సింగ్ సైఫ్ అలీఖాన్‌ను పెళ్లి చేసుకుంది. మరి ఒకప్పుడు తనకు భార్యగా హీరోయిన్ వద్దని స్టేట్ మెంట్ ఇచ్చిన శాస్త్రి ఇప్పుడు నిమ్రత్ కౌర్ ను పెళ్లి చేసుకుంటాడా? అనేది ఆసక్తిదాయకమైన అంశం. ఇక నిమ్రత్ మాత్రం.. శాస్త్రితో తనకు ముడిపెడుతూ వస్తున్న వార్తల్లో నిజంలేదని అంటోంది.