బాలీవుడ్ స్టయిల్ లో మహర్షి

మహేష్ బాబు-వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో ముస్తాబవుతున్న సినిమా మహర్షి. వచ్చే ఏడాది సమ్మర్ టైమ్ కు కాస్త అటు ఇటుగా వచ్చే సినిమా ఇది. అయితే షూటింగ్ మాత్రం కాస్త వేగంగానే చేసేస్తున్నారు.…

మహేష్ బాబు-వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో ముస్తాబవుతున్న సినిమా మహర్షి. వచ్చే ఏడాది సమ్మర్ టైమ్ కు కాస్త అటు ఇటుగా వచ్చే సినిమా ఇది. అయితే షూటింగ్ మాత్రం కాస్త వేగంగానే చేసేస్తున్నారు. డిసెంటర్ నాటికి వర్క్ అంతా అయిపోయేలా ప్లాన్ చేయడం విశేషం. అంటే సినిమా విడుదలకు నాలుగు నెలలు ముందే అన్నమాట.

దీనికి కారణం మరేంకాదు. ఈసారి సినిమా మేకింగ్ విషయంలో డైరక్టర్ వంశీ పైడిపల్లి పూర్తిగా బాలీవుడ్ స్టయిల్ ను ఫాలో కాబోతున్నారట. బాలీవుడ్లో  సినిమా షూటింగ్ తో పాటు, పోస్ట్ ప్రొడక్షన్ కు కూడా చాలా టైమ్ తీసుకుంటారు. పెద్ద సినిమాలయితే పోస్ట్ ప్రొడక్షన్ కు ఆరునెలల నుంచి ఏడాది టైమ్ తీసుకునే డైరక్టర్లు వున్నారు.

సినిమాను పక్కాగా, పూల్ ఫ్రూప్ గా తయారుచేయాలంటే, పోస్ట్ ప్రొడక్షన్ కు ఆ మాత్రం టైమ్ కావాలి. కానీ మన టాలీవుడ్ స్టయిల్ వేరు. సినిమా సగం షూటింగ్ అయిన దగ్గర నుంచీ సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తారు. అటు ఇటు రెండు పడవల మీద కాళ్లు వేసి పనికానిస్తారు. చివర్న గట్టిగా రెండువారాలు నేరుగా పోస్ట్ ప్రొడక్షన్ మీద కూర్చుని ఫినిష్ చేస్తారు. అంతా హడావుడి.. హడావుడి.

కానీ ఈసారి మహర్షి సినిమా విషయంలో ఇలా చేయకూడదు అనుకుంటున్నారట వంశీ పైడిపల్లి. పక్కాగా పోస్ట్ ప్రొడక్షన్ కు కొంత టైమ్ వుండేలా షెడ్యూళ్లు ప్లాన్ చేసుకుంటున్నారట. మంచి నిర్ణయమే. ముగ్గురు నిర్మాతలు మహర్షి సినిమాను నిర్మిస్తున్నారు. పివిపి, అశ్వనీదత్ లు స్లీపింగ్ పార్టనర్ లుగా, దిల్ రాజు యాక్టివ్ పార్టనర్లు గా ఈ సినిమా రెడీ అవుతోంది.