సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో తయారవుతున్న పుష్ప సినిమా విడుదల ఆర్నెలు వాయిదా పడినట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది ఆగస్టు కు రావాలాన్నది ప్లాన్. అయితే డిసెంబర్ లేదా జనవరి లో విడుదల చేసే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది. అందుకే బన్నీ-ఎన్టీఆర్ క్లారిటీగా అన్నీ మట్లాడుకుని, కొరటాల శివ ను ఎన్టీఆర్ సినిమా ముందుగా చేసేందుకు ఒప్పించారు.
త్రివిక్రమ్ -ఎన్టీఆర్ సినిమా క్యాన్సిల్ అయిందని ముందుగానే గ్రేట్ ఆంధ్ర బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. అందుకే కొరటాలపై ఎన్టీఆర్ ప్రెషర్ పెట్టారు.
కొరటాల స్నేహితుడి స్నేహసుధ బ్యానర్ కు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ను కలిపి ఈ సినిమా స్టార్ట్ చేస్తారు. ఇది పూర్తయిన తరువాత బన్నీ సినిమా వుంటుంది.
ఈ ప్రకటన కనుక బయటకు వస్తే, తివిక్రమ్-మహేష్ సినిమా ప్రకటన కూడా బయటకు వచ్చే అవకాశం వుంది.