జడ్జిమెంట్ విషయంలో కొందరు చాలా పెర్ ఫెక్ట్ గా ఉంటారు. సినిమా ఆడుతుందా ఆడదా అనే విషయాన్ని 2 ముక్కల్లో చెప్పేస్తారు వీళ్లు. దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా ఇంతే. తన వరకు సినిమా ఆడుతుందా లేదా అనే విషయాన్ని బల్లగుద్ది మరీ చెబుతానంటున్నాడు కమ్ముల.
“నేను ఒకలా అనుకుంటే సినిమా మరోలా ఆడే పరిస్థితి ఉండదు. నాకు టెర్రిఫిక్ జడ్దిమెంట్ ఉంది. సినిమా ఆడుతుందా ఆడదా అని బల్ల గుద్ది చెబుతాను నేను. హ్యాపీడేస్ కు చెప్పాను. లీడర్ కు చెప్పాను. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కు మాత్రం అంత బల్ల గుద్ది చెప్పలేకపోయాను.”
ఫిదా సినిమా కూడా అలానే సూపర్ హిట్ అవుతుందని బల్ల గుద్ది చెప్పానంటున్నాడు కమ్ముల. ఈ సినిమా కథను మహేష్, రామ్ చరణ్ లాంటి హీరోలకు నెరేట్ చేసిన విషయాన్ని అంగీకరించిన ఈ దర్శకుడు.. కథలు చెప్పడంలో తను చాలా వీక్ అంటున్నాడు.
“నా కథకు ఎవరైనా పెద్ద హీరో కుదురుతాడనుకుంటే చాలా సిన్సియర్ గా వెళ్లి కథ చెబుతాను. అలా చెప్పాను కూడా. నచ్చకపోతే నచ్చలేదని చెప్పేస్తారు. బై అని చెప్పి వచ్చేస్తాను. ప్రాబ్లమ్ ఏంటంటే.. నేను చాలా వీక్ గా నెరేట్ చేస్తాను. నేను స్టోరీ చెబుతుంటే హీరోలకు ఆవులింతలు వస్తాయి. ఫిదా కథ మహేష్ కు, రామ్ చరణ్ కు చెప్పాను. వాళ్లు రిజెక్ట్ చేశారు.”
కమ్ముల డైరక్ట్ చేసిన లవ్ స్టోరీ సినిమా ఈ నెలలో థియేటర్లలోకి రాబోతోంది. నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాపై కూడా కమ్ముల కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.