నితిన్ – కృష్ణ చైతన్య కాంబినేషన్ లో చిరకాలంగా వినిపిస్తున్న ప్రాజెక్ట్ పేరు'పవర్ పేట'. ఈ సినిమాను మూడు భాగాల్లో తీస్తారని ఏళ్ల కిందట వినిపించింది. కాదు దాన్ని రెండు భాగాల కింద సెట్ చేసారని కొన్ని నెలల కిందటి నుంచి వినిపించడం ప్రారంభమైంది.
అంధాదూన్ రీమేక్ తరువాత నితిన్ చేయబోయే సినిమా ఇదే అని కొన్నాళ్ల కిందటి నుంచి వార్తలు మొదలయ్యాయి. ఆ మధ్య నితిన్ ను ఇదే విషయం అడిగితే నిజమే అని కన్ ఫర్మ్ చేసాడు.
అయితే మొదటి భాగం హిట్ అయితేనే రెండో భాగం అని క్లారిటీ ఇచ్చాడు. అయితే లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే, ఈ పవర్ పేట ప్రాజెక్ట్ ను నితిన్ పక్కన పెట్టేసాడు. రచయిత వక్కంతం వంశీ తీసుకువచ్చిన సబ్జెక్ట్ నచ్చడంతో అతని డైరక్షన్ లోనే ఆ సినిమా స్టార్ట్ చేయాలని డిసైడ్ అయిపోయాడు. ఈ సినిమాకు నిర్మాతగా టాగోర్ మధు నిర్మాత.
నా పేరు సూర్య సినిమా తరువాత వక్కంతం వంశీ డైరక్ట్ చేసే రెండో సినిమా ఇదే. ఈ మేరకు త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం వుంది. ప్రస్తుతం అంథాదూన్ షూటింగ్ గోవాలో జరుగుతోంది.
కృష్ణ చైతన్య గతంలో చల్ మోహన రంగ అనే సినిమాను నితిన్ తో చేసారు. అప్పటి నుంచి పవర్ పేట పేరు వార్తల్లో వుంటూనే వస్తోంది. ఇది పొలిటికల్ టచ్ సబ్జెక్ట్ .