ఆర్ఆర్ఆర్ వచ్చేసింది. 50 రోజులు కూడా అయిపోయింది. మరోవైపు ఆచార్య కూడా వచ్చేసింది. థియేట్రికల్ రన్ దాదాపు పూర్తి చేసుకుంది. ఇటు ఎన్టీఆర్, అటు కొరటాల ఇద్దరూ ఫ్రీ అయిపోయారు. కానీ వీళ్ల కాంబినేషన్ లో రావాల్సిన కొత్త సినిమా అప్ డేట్ మాత్రం ఇంతవరకు రాలేదు.
మరోవైపు కేజీఎఫ్2 రిలీజైపోయింది. చేతిలో సలార్ సినిమా ఉన్నప్పటికీ ప్రశాంత్ నీల్ కూడా కాస్త ఫ్రీ అయ్యాడు. కానీ ఎన్టీఆర్-నీల్ కాంబోలో రావాల్సిన సినిమాపై ఎలాంటి అప్ డేట్ లేదు.
ఈ రెండు సినిమాలు కాకుండా.. బుచ్చిబాబు దర్శకత్వంలో కూడా ఎన్టీఆర్ ఓ సినిమా చేయాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాకు సంబందించి కూడా హీరో-దర్శకుడి మధ్య చాన్నాళ్ల కిందటే చర్చలు జరిగాయి. మరి ఆ సినిమా పరిస్థితేంటి?
ఇలా ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీస్ కు సంబంధించి ఏ ఒక్క సినిమాపై క్లారిటీ రాలేదు. వీటిలో కనీసం ఒక్క క్లారిటీ అయినా మరో 3 రోజుల్లో వస్తుందని ఆశిస్తున్నారు తారక్ ఫ్యాన్స్. 20న ఎన్టీఆర్ పుట్టినరోజు ఉంది. ఆ సందర్భంగా అతడి అప్ కమింగ్ మూవీస్ పై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఎదురుచూస్తున్నారు.
నిజానికి కొరటాల-తారక్ సినిమాకు సంబంధించి చిన్న చిన్న అప్ డేట్స్ వస్తున్నాయి. రెగ్యులర్ షూటింగ్ డేట్స్ ఇవేనంటూ కొన్ని తేదీలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ యూనిట్ నుంచి వాటిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు.
ఈ ప్రాజెక్టులు అన్నింటిపై కాకపోయినా, కనీసం కొన్నింటిపై మరో 3 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఆచార్య దెబ్బతో ఎన్టీఆర్-కొరటాల ప్రాజెక్టుపై ఫ్యాన్స్ ఆసక్తి తగ్గింది. వాళ్లు ఎన్టీఆర్-నీల్ కాంబోపై అప్ డేట్ కోరుకుంటున్నారు. మరి 20వ తేదీన ఎన్టీఆర్ నుంచి ఎలాంటి ప్రకటన రాబోతోంది?