అక్కడ జనసేనతో చేతులు కలిపిన టీడీపీ ?

తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే ద్వంద్వ ప్రమాణాలు రెండు కళ్ల సిద్ధాంతాలు అని అంతా చెబుతారు. ఎన్నికల బహిష్కరణ అని ఒక వైపు చెబుతూనే మరో వైపు ఎన్నికల్లో తమ్ముళ్లు పోటీ చేయడాన్ని ఆ…

తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే ద్వంద్వ ప్రమాణాలు రెండు కళ్ల సిద్ధాంతాలు అని అంతా చెబుతారు. ఎన్నికల బహిష్కరణ అని ఒక వైపు చెబుతూనే మరో వైపు ఎన్నికల్లో తమ్ముళ్లు పోటీ చేయడాన్ని ఆ పార్టీ నేతలు సమర్ధించుకుంటున్నారు.

అంతే కాదు వారి వెంట ప్రచారానికి కూడా బడా నాయకులు వెళ్తున్నారు. మరో విశేషం ఏంటి అంటే విశాఖ జిల్లాలోని చోడవరం నియోజకవర్గంలో బాహాటంగా టీడీపీ జనసేన నాయకులు చేతులు కలిపేశారు.

ఒకరికి ఒకరు సహకరించుకోవాలని ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు. బయటకు మాత్రం రెండు పార్టీ పెద్దలు ఒకరిని ఒకరు విమర్శించుకున్నట్లుగా కనిపిస్తారు కానీ లోపల మాత్రం ఆ బంధం అలాగే కొనసాగుతోంది అనడానికి విశాఖ జిల్లాలో పొత్తులు ఒక ఉదాహరణ అని ప్రత్యర్ధి పార్టీలు విమర్శిస్తున్నాయి.

ఇక్కడ జెడ్పీటీసీ పదవికి జనసేనకు మద్దతు తెలపాలని టీడీపీ నిర్ణయించింది. అదే విధంగా ఎంపీటీసీకి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్ధులకు జనసేన మద్దతు ఇచ్చేట్లుగా ఒప్పందం కుదిరింది. మరి జనసేనతో అధికారికంగా పొత్తు ఉన్న బీజేపీ గురించి ఎవరూ పట్టించుకోవడంలేదు. 

కాషాయ పార్టీ కూడా ఈ పరిణామాల మీద కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉంది. మొత్తానికి బాబు మార్క్ పాలిట్రిక్స్ తో పరిషత్ ఎన్నికల్లో తమ్ముళ్ళ హుషార్ ఇలా ఉందని చెప్పాలేమో.