ఆర్జీవీ పై సినిమా అస్త్రం.. ఆర్జీవీ!

ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తీరును ఆ మ‌ధ్య గ‌ట్టిగా విమ‌ర్శించారు సినీ గీత ర‌చ‌యిత జొన్న‌విత్తుల‌. 'క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు' అంటూ రామ్ గోపాల్ వ‌ర్మ సినిమా టైటిల్ ను అనౌన్స్…

ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తీరును ఆ మ‌ధ్య గ‌ట్టిగా విమ‌ర్శించారు సినీ గీత ర‌చ‌యిత జొన్న‌విత్తుల‌. 'క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు' అంటూ రామ్ గోపాల్ వ‌ర్మ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేసిన‌ప్పుడు జొన్న‌విత్తుల తీవ్రంగా స్పందించారు. రామ్ గోపాల్ వ‌ర్మ‌పై ధ్వ‌జ‌మెత్తాడు. ఆ స‌మ‌యంలో ఆర్జీవీ పై సినిమా తీస్తానంటూ కూడా జొన్న‌విత్తుల ప్ర‌క‌టించారు. అప్పుడేదో టైటిల్ కూడా ప్ర‌క‌టించారాయ‌న‌.  ఆ టైటిలేమో కానీ ఇప్పుడు 'ఆర్జీవీ' అంటూ సినిమాను చేస్తున్న‌ట్టుగా ప్ర‌క‌ట‌న వ‌చ్చింది.

జొన్న‌విత్తుల ఆ సినిమాకు డైరెక్ష‌న్ చేయ‌బోతున్నార‌ట‌. అందుకు సంబంధించి ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఇలా జొన్న‌విత్తుల అన్నంత ప‌ని చేస్తున్న‌ట్టుగా ఉన్నారు. చాలా మందిపై ఆర్జీవీ వివాదాస్ప‌ద టైటిళ్ల‌ను అనౌన్స్ చేయ‌డం, వాటిలో కొన్ని సినిమాల‌ను తీయ‌డం జ‌రిగింది. ఈ క్ర‌మంలో ఇప్పుడు.. ఆర్జీవీ మీదే సెటైరిక్ సినిమా వ‌స్తున్న‌ట్టుగా ఉంది. స్వేచ్ఛ‌ను కొంత‌మంది దుర్వినియోగం చేస్తున్నార‌ని, వారి మీదే ఈ సినిమా అని రూప‌క‌ర్త‌లు ప్ర‌క‌టించారు. ఇలా డైరెక్టుగా ఆర్జీవీ పేరు మీదే ఆర్జీవీని టార్గెట్ చేస్తున్న‌ట్టుగా ఉన్నారు.

ఇది వ‌ర‌కూ కూడా వ‌ర్మ పేరుతో ప‌లు సినిమాలు  వ‌చ్చాయి. డాట‌రాఫ్ వ‌ర్మ తో మొద‌లుపెడితే.. ఆర్జీవీ పేరును అటు ఇటు చేసి ప‌లు సినిమాలు వ‌చ్చాయి. అయితే వాటి కాన్సెప్ట్ లు వేరు. ఇప్పుడు డైరెక్టుగా వ‌ర్మ‌నే టార్గెట్ గా చేసుకుని ఆయ‌న పేరుతో సినిమా వ‌స్తోంది. మ‌రి ఈ సెటైరిక్ సినిమా ఏ స్థాయిలో ఉంటోందో, ఏ స్థాయిలో పేలుతుందో! ఈ సినిమానైతే ఆర్జీవీ స్వాగ‌తించ‌వ‌చ్చు. త‌నే స‌మ‌ర్పకుండిగా వ్య‌వ‌హ‌రించ‌డానికి రెడీ అంటాడేమో!