కరోనా టెర్రర్.. వర్షాలతో మరింత పెరిగిన భయం

ఇప్పటివరకు తెలంగాణలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అయినా కూడా ప్రజల్లో భయాందోళనలు అలానే ఉన్నాయి. అయితే వేసవి కాలం మొదలుకావడంతో ఎండలు పెరిగితే కరోనా ప్రభావం ఉండదని మనసులో కాస్త…

ఇప్పటివరకు తెలంగాణలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అయినా కూడా ప్రజల్లో భయాందోళనలు అలానే ఉన్నాయి. అయితే వేసవి కాలం మొదలుకావడంతో ఎండలు పెరిగితే కరోనా ప్రభావం ఉండదని మనసులో కాస్త ధీమా. ఇప్పుడు ఆ చిన్న అవకాశం కూడా లేకుండా పోయింది. ఊహించని విధంగా వాతావరణం మారిపోయింది.

తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వర్షాలు పడుతున్నాయి. చలి-తేమ పెరిగిపోయింది. ఉపరితల ఆవర్తనం కారణంగా మరో 2 రోజులు పరిస్థితి ఇలానే ఉండొచ్చని చెబుతోంది వాతావరణ శాఖ. ఇలాంటి వాతావరణంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి అవకాశాలు ఎక్కువ. అందుకే ప్రజలు మరోసారి భయభ్రాంతులకు గురవుతున్నారు.

ఇటు తెలంగాణ ప్రభుత్వం మాత్రం ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని చెబుతోంది. ఇప్పటివరకు పాజిటివ్ కేసులు నమోదుకాలేదని, అనుమానిత రోగుల రిపోర్టులు కూడా ఈరోజు వస్తాయని చెబుతోంది. వాళ్లకు కూడా నెగిటివ్ వచ్చే అవకాశం ఉందని చెబుతోంది.

అటు చైనాను మాత్రం కరోనా వణికిస్తోంది. మృతుల సంఖ్య తాజాగా 908కి చేరింది. 40వేల మందికి ఈ వైరస్ సోకినట్టు చైనా ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో 296 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపింది. ఒక్క ఆదివారం రోజునే చైనాలో 97 మంది కరోనాతో మరణించగా.. మరో 3వేల మందికి ఈ వైరస్ సోకినట్టు గుర్తించారు. ఉన్నంతలో సంతోషకరమైన విషయం ఏంటంటే.. సాధారణ మందులతోనే (అధిక మోతాదు) కరోనా అదుపులోకి వస్తోంది. చైనాలో ఇప్పటివరకు 3వేల 2వందల మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

13 జిల్లాల్లో 13 ప్రత్యేక కోర్టులు