కరోనా టెర్రర్… హైదరాబాద్ లో ఉన్నట్టా లేనట్టా?

స్వయంగా తెలంగాణ ప్రభుత్వం సీన్ లోకి వచ్చి ప్రకటించినప్పటికీ కరోనా భయాలు తొలగలేదు. ముఖ్యంగా హైదరాబాద్ లో కరోనా వైరస్ వ్యాప్తిపై చాలామంది ప్రజలు అనుమానాలు, అపోహలు పడుతున్నారు. ఇంతకీ హైదరాబాద్ లో కరోనా…

స్వయంగా తెలంగాణ ప్రభుత్వం సీన్ లోకి వచ్చి ప్రకటించినప్పటికీ కరోనా భయాలు తొలగలేదు. ముఖ్యంగా హైదరాబాద్ లో కరోనా వైరస్ వ్యాప్తిపై చాలామంది ప్రజలు అనుమానాలు, అపోహలు పడుతున్నారు. ఇంతకీ హైదరాబాద్ లో కరోనా ఉన్నట్టా లేనట్టా?

ఇప్పటికీ ప్రభుత్వం చెబుతోంది ఒకటే. హైదరాబాద్ లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. మరి అలాంటప్పుడు కొంతమందిని ఐసోలేషన్ యూనిట్లలో పెట్టడం ఎందుకు? ప్రత్యేకంగా వాళ్లను పరిశీలించడం ఎందుకు? దీనికి కూడా ప్రభుత్వం వివరణ ఇస్తోంది. కేవలం అనుమానంతోనే కొంతమందిని ఐసోలేషన్ యూనిట్లలో (ఎవర్నీ కలవకుండా విడిగా ఉండే గది) పెట్టామని, అంతేతప్ప వాళ్లకు కరోనా ఉన్నట్టు కాదని చెబుతోంది.

ప్రభుత్వం ఇలా ప్రతిరోజూ వివరణ ఇస్తున్నప్పటికీ హైదరాబాద్ ను కరోనా భయం వీడలేదు. వాతావరణంలో మార్పులు ఈ భయాన్ని మరింత పెంచుతున్నాయి. ఇక ఎండలు కాస్తాయనుకునే టైమ్ కు నగరంలో వర్షం పడింది. పోనీ వర్షం తగ్గిన తర్వాతైనా ఎండాకాలం వస్తుందనుకునే టైమ్ కు మరోసారి చలి, పొగమంచు కమ్మేసింది. ఈ వాతావరణం కూడా ప్రజల భయాందోళనకు ఓ కారణం.

ప్రస్తుతానికైతే ప్రభుత్వం చెబుతున్న ప్రకారం, హైదరాబాద్ లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఇప్పటివరకు 70 మందికి కరోనా పరీక్షలు చేసిన గాంధీ ఆస్పత్రి వైద్యులు వాళ్లలో 62 మందికి వైరస్ లేదని ప్రకటించారు. మరో 8 మంది రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. వాళ్లకు కూడా కరోనా వచ్చే అవకాశం లేదంటున్నారు. మరోవైపు అనుమానిత రోగుల రద్దీని దృష్టిలో పెట్టుకొని, 10 పడకలతో మరో ఐసోలేషన్ వార్డ్ ను ఏర్పాటుచేసేందుకు రెడీ అవుతున్నారు. ఏదైమైనా బాగా ఎండలు ఎక్కేవరకు ఈ కరోనా అనుమానాలు ప్రజల్ని వీడిపోవు.

14 రోజుల్లోనే ఉరి శిక్ష‌