సినిమాల్లో కమెడియన్ అనుకున్నారేమో, రాజకీయాల్లో మాత్రం నాయకున్నే అంటున్నాడు అలీ. అలీ ఒకపుడు పసుపు పార్టీ తమ్ముడే. కానీ ఇపుడు వైసీపీలో కీలక నేత. ఆయన నిన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా ప్రచారం చేశారు.
వైసీపీ మంచి విజయం సాధించింది. ఇక అలీకి కీలకమైన పదవి కూడా తొందరలోనే వస్తుందని అంతా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా విశాఖ పర్యటనలో అలీ చంద్రబాబుపై బాగానే పంచులేశారు.
విశాఖవాసులు మంచి వాళ్ళు, శాంతమూర్తులు అని తరచూ బాబు అంటూంటారు. అదె డైలాగ్ ని రిపీట్ చేస్తూ అలీ అవును విశాఖవాసులు మంచివారే కానీ, తేడా వస్తేనే తన ప్రతాపం చూపుతారు అంటూ హాట్ కామెంట్స్ చేశారు.
ఎవరినికి ఎక్కడ ఉంచాలో బాగా తెలిసిన వారు విశాఖవాసులు అంటూ చంద్రబాబుని 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడించిన విశాఖ వాసుల గురించి బహు గొప్పగా, సెటైరికల్ గా చెప్పాడు.
విశాఖలో రాజధాని వద్దు, విశాఖలో ఏ అభివ్రుధ్ధి జరగవద్దు అని పట్టుపడుతున్న తమ్ముళ్ళకు ఈసారి కూడా తేడా తీర్పే జనం ఇస్తారేమో మరి. తొందరలో లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి. మరి సైకిల్ పార్టీ నై విశాఖ అంటోంది. దానికి తగిన తీర్పు విశాఖ మంచోళ్ళు ఇస్తారేమో.
ఇక అలీ వైసీపీ సర్కార్ ని జగన్ని బాగానే పొగిడారు. ముస్లిం మైనారిటీలకు ఈ ప్రభుత్వం ఎంతో మేలు చేస్తోందని, హజ్ యాత్రకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తోందని చెప్పుకొచ్చారు. ఇవన్నీ ఇలా ఉంటే అలీ హాట్ కామెంట్స్ మాత్రం తమ్ముళ్ళను నిద్రపట్టనీయడంలేదులా ఉంది.