దేవరకొండ నిర్ణయంపై మిక్స్ డ్ రెస్పాన్స్

“నాకు తెలుసు.. వరల్డ్ ఫేమస్ లవర్ అనేది నా లాస్ట్ లవ్ స్టోరీ. మనిషిలా కొంచెం మారుతున్నా. టేస్టులు కొంచెం మారుతున్నాయి. బేసికల్ గా లైఫ్ లో కొత్త దశలోకి వెళ్తున్నా. ఇది చేసేప్పుడే…

“నాకు తెలుసు.. వరల్డ్ ఫేమస్ లవర్ అనేది నా లాస్ట్ లవ్ స్టోరీ. మనిషిలా కొంచెం మారుతున్నా. టేస్టులు కొంచెం మారుతున్నాయి. బేసికల్ గా లైఫ్ లో కొత్త దశలోకి వెళ్తున్నా. ఇది చేసేప్పుడే నాకు తెలుసు.. ఇదే నా లాస్ట్ లవ్ స్టోరీ అవబోతోందని.”

రీసెంట్ గా విజయ్ దేవరకొండ ఇచ్చిన స్టేట్ మెంట్ ఇది. వరల్డ్ ఫేమస్ లవర్ తర్వాత ఇక ప్రేమకథలు చేయననే అర్థం వచ్చేలా మాట్లాడాడు ఈ హీరో. దీనిపై సోషల్ మీడియాలో మిక్స్ డ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ వయసులోనే లవ్ స్టోరీలు చేయడం ఆపేస్తే, భవిష్యత్తులో ఇక ఆ అవకాశం ఉండదంటున్నారు మరికొందరు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి హీరోలకు వయసు ఉన్నప్పటికీ ప్రేమకథలు చేసే రేంజ్ దాటిపోయారని సూచిస్తున్నారు. సో.. దేవరకొండ లవ్ స్టోరీస్ చేయడానికి ఇదే సరైన టైమ్ అని వాదిస్తున్నారు.

మరికొందరు మాత్రం దీనికి రివర్స్ లో వాదిస్తున్నారు. విజయ్ దేవరకొండ మంచి నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. వరుసగా ప్రేమకథలు చేసుకుంటూ పోతే మొనాటనీ వచ్చేస్తుందని, క్రేజ్ కూడా తగ్గిపోతుందని సూచిస్తున్నారు. కొత్త క్యారెక్టర్లు, కొత్త జానర్లు సెలక్ట్ చేసుకున్నప్పుడే ఎలాంటి ఇమేజ్ పడకుండా, నటుడిగా పూర్తిస్థాయిలో ఎదగొచ్చని చెబుతున్నారు.

సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ రెండు వెర్షన్లలో నిజం ఉంది. మరి దేవరకొండ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. కొత్త జానర్స్, కొత్త క్యారెక్టర్స్ టచ్ చేస్తూనే.. అడపాదడపా లవ్ స్టోరీలు కూడా చేయడం బెటరేమో.