దేవసేన అనుష్క చేస్తున్న హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా నిశ్శబ్దం. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో అనుష్కుకు ఓ మార్క్ వుంది. అరుంధతి, రుద్రమదేవి, భాగమతి వరుసలో నిశ్శబ్ధం కూడా వస్తోంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణంతా పూర్తయ్యింది.
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలను విడుదల చేసి ఏప్రిల్ 2న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి అనుష్క లుక్ ను విడుదల చేసారు. సాక్షి అనే డిఫరెంట్ పాత్రలో అనుష్క మెప్పించనున్నారు. అలాగే మాధవన్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజ్, శ్రీనివాస్ అవసరాల , మైకేల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ పాత్రల లుక్స్‌తో పాటు విడుదలైన టీజర్ సినిమాపై ఉన్న అంచనాలను పెంచింది.