టీజర్ అదిరింది… పవన్ మెసేజ్

మెగాస్టార్ బర్త్ డే ఫంక్షన్ లో హీరో రామ్ చరణ్ తేజ్ ఓ విషయం వెల్లడించారు. ఇది కేవలం అభిమానులను ఉత్తేజపరచడానికి చెప్పడం లేదని, వాస్తమని చెప్పి మరీ చెప్పారు. ఇంతకీ విషయం ఏమిటంటే,…

మెగాస్టార్ బర్త్ డే ఫంక్షన్ లో హీరో రామ్ చరణ్ తేజ్ ఓ విషయం వెల్లడించారు. ఇది కేవలం అభిమానులను ఉత్తేజపరచడానికి చెప్పడం లేదని, వాస్తమని చెప్పి మరీ చెప్పారు. ఇంతకీ విషయం ఏమిటంటే, సైరా టీజర్ ఫైనల్ అవుట్ పుట్ చరణ్ కు 10.45కి వచ్చిందట. సైరా నిర్మాత చరణ్ నే అన్న సంగతి తెలిసిందే.

తనకు టీజర్ రాగానే చరణ్ చేసిన తొలి వాట్సాప్ ఫార్వార్ట్ బాబాయ్ పవన్ కళ్యాణ్ కే నట. సరిగ్గా 11.15కు పవన్ నుంచి మెసేజ్ వచ్చిందట. టీజర్ అదిరిపోయింది. థియేటర్ లో ఎప్పుడు చూస్తానా అని వుంది అంటూ. ఈ మాటలు చెప్పి చరణ్ తెగ సంబరపడిపోయాడు.

సినిమా విడుదలకు చాలా టైమ్ వున్నా, దర్శకుడు సురేందర్ రెడ్డిని ఒప్పించి టీజర్ వదిలామని, దానికి కారణం, అభిమానులకు తమకు ఇద్దరికీ ఉత్సాహం వస్తుందనే అని చరణ్ వెల్లడించాడు.