ఆ ముగ్గురి సినిమాలు 2020లోనే

ఈ ఏడాది విడుదలైన రెండు మంచి హిట్ సినిమాలు రంగస్థలం, భరత్ అనే నేను. ఈ సినిమాలు విడుదలై ఇప్పటికే మూడు నెలలు దాటేసింది. కానీ మూడు కాదు, ఆరు నెలలు అయినా ఈ…

ఈ ఏడాది విడుదలైన రెండు మంచి హిట్ సినిమాలు రంగస్థలం, భరత్ అనే నేను. ఈ సినిమాలు విడుదలై ఇప్పటికే మూడు నెలలు దాటేసింది. కానీ మూడు కాదు, ఆరు నెలలు అయినా ఈ రెండు సినిమాల డైరక్టర్ల కొత్త వెంచర్లు స్టార్ట్ అయ్యే అవకాశం కనిపించడం లేదు. టాప్ డైరక్టర్లకు టాప్ హీరోల సంఖ్యకు అంతగా మాచ్ కావడంలేదు. టాలీవుడ్ లో ఇప్పుడు ఈ పరిస్థితి వుంది. అందుకే డైరక్టర్లు వెయిటింగ్ లో వుండాల్సి వస్తోంది.

కొరటాల శివ తన తరువాత సినిమాను మెగాస్టార్ తో చేయాలని డిసైడ్ అయ్యారు. కానీ మెగాస్టార్ చిరంజీవి వచ్చే ఏడాది సమ్మర్ తరువాత కానీ ఖాళీ అయ్యే పరిస్థితి, కాల్ షీట్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అంటే దాదాపు సినిమా విడుదల తరువాత ఏడాది పాటు ఓ టాప్ డైరక్టర్ ఖాళీగా వుండిపోవాల్సి వస్తోంది. అనుకుంటే ఈలోగా ఆయన కనీసం ఓ సినిమా తీసి వుండే అవకాశం క్లియర్ గా వుంది. పైగా దీనివల్ల టాలీవుడ్ లో కనీసం నూరు నూటా యాభై కోట్ల టర్నోవర్.

ఇక సుకుమార్ సంగతీ ఇలాగే వుంది. ఆయన కూడా రంగస్థలం తరువాత మహేష్ బాబు సినిమాను ఎంచుకున్నారు. మహేష్ కూడా వచ్చే ఏడాది సమ్మర్ వరకు ఖాళీ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అంటే సుకుమార్ సినిమా కూడా వచ్చే సమ్మర్ కే స్టార్ట్ అవుతుంది.

ఈ లెక్కన ఈ ఇద్దరు టాప్ హీరోల సినిమాలు కూడా 2019లో వుంటాయా? అన్నది అనుమానంగా వుంది. ఎందుకంటే ఎంత స్క్రిప్ట్ వర్క్, మిగతా పనుల అంతా పద్దతిగా పూర్తిచేసి పెట్టుకున్నా కూడా, పెద్ద సినిమా అంటే ఆరునెలలు పట్టకుండా వుండదు. అందువల్ల కొరటాల శివ, సుకుమార్ ల సినిమాలు 2020లో కానీ వుండకపోవచ్చు.

ఇక మరో టాప్ డైరక్టర్ రాజమౌళి అయితే చెప్పనక్కరే లేదు. ఏళ్లకు ఏళ్లు గ్యాప్ తరువాతే ఆయన సినిమాలు వస్తుంటాయి. అందువల్ల బాహుబలి 2 తరువాత మూడేళ్లకు కానీ ఆయన సినిమా వచ్చే దాఖలా కనిపించడం లేదు. ఆయన సినిమా ఈ ఏడాది చివర్న మొదలు కావాలి. అక్కడి నుంచి కనీసం ఏడాది పైనే షూట్. అంటే ఆయన సినిమా కూడా 2020 లోనే.