‘రెడ్డి డైరీ’ బిగ్ బాంబ్‌ పేల్చిన శ్రీ‌రెడ్డి

త‌న‌ను లైంగికంగా వాడుకున్న సినీ ప్రముఖుల జాత‌కాల‌ను వీడియోల‌తో స‌హా ఆధారాల‌ను “రెడ్డిడైరీ ” ద్వారా ప్రపంచానికి తెలియ‌జేస్తాన‌ని శ్రీ‌రెడ్డి ఈ ద‌ఫా బిగ్ బాంబ్‌ పేల్చారు. శ్రీ‌రెడ్డి కాస్టింగ్ కౌచ్ తుపాను వెల‌సింద‌ని…

త‌న‌ను లైంగికంగా వాడుకున్న సినీ ప్రముఖుల జాత‌కాల‌ను వీడియోల‌తో స‌హా ఆధారాల‌ను “రెడ్డిడైరీ ” ద్వారా ప్రపంచానికి తెలియ‌జేస్తాన‌ని శ్రీ‌రెడ్డి ఈ ద‌ఫా బిగ్ బాంబ్‌ పేల్చారు. శ్రీ‌రెడ్డి కాస్టింగ్ కౌచ్ తుపాను వెల‌సింద‌ని ఊపిరి పీల్చుకుంటున్న సినీప‌రిశ్రమ‌కు నిన్నటి ఆమె చెన్పై ప్రెస్‌మీట్ కొంతమంది సినీ పెద్దల‌కు నిద్రక‌ర‌వు చేస్తోంది. కాస్టింగ్‌ కౌచ్ వ్యవ‌హారంలో జూనియ‌ర్ ఆర్టిస్ట్ శ్రీ‌రెడ్డి ఆరోప‌ణ‌లు చినికిచినికి గాల‌వాన‌గా మారి పెనుసంచ‌ల‌నం సృష్టించిన వ్యవ‌హారం ఇప్పుడిప్పుడే స‌ర్దుమ‌ణిగేలా లేదు.

రెడ్డి డైరీ పేరుతో శ్రీ‌రెడ్డి స్వీయ జీవితాన్ని త‌మిళంలో తెర‌పైకి ఎక్కించ‌నున్నట్టు ఆ చిత్ర ద‌ర్శకుడు అల్లావుద్దీన్ చెన్నైలో విలేక‌రుల స‌మావేశంలో వెల్లడించారు. అస‌లే శ్రీ‌రెడ్డి. ఎవ‌రినీ లెక్కచేయ‌ని మ‌న‌స్తత్వం. స‌ర్వం కోల్పోయి… అన్నీ తెగించి మాట్లాడుతున్న వ్యవ‌హారం తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ వ్యవ‌హారంలో ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు కుమారుడితో పాటు స‌హజ న‌టుడు నాని స‌హా ప‌లువురు సినీ ప‌రిశ్రమ ముఖ్యుల‌పై ఆమె తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే.

అంతేకాదు సురేష్‌బాబు కుమారుడితో సంబంధాల‌పై ఫొటోల‌ను కూడా విడుద‌ల చేసి సంచ‌ల‌నం సృష్టించింది. శ్రీ‌రెడ్డి ఆరోప‌ణ‌ల‌తో మొద‌లైన అల‌జ‌డి జీవిత దంప‌తులు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ కుటుంబం, ఇత‌ర‌త్రా చిన్నాపెద్దా న‌టులంద‌రూ రోడ్డు మీద‌కు రావాల్సి వ‌చ్చింది. ఆరోప‌ణ‌లు, ప్రత్యారోప‌ణ‌ల‌తో తెలుగు చాన‌ళ్లు దాదాపు ఆరునెల‌ల పాటు విరామం లేకుండా సినీన‌టుల‌తోనే నిండిపోయాయి. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్‌పై శ్రీ‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయ‌డం, దానికి తానే కార‌ణ‌మ‌ని ద‌ర్శకుడు రాంగోపాల్‌వ‌ర్మ వివ‌ర‌ణ ఇవ్వడం, చిరు ఫ్యామిలీ ఆందోళ‌న చేయ‌డం అంద‌రికీ తెలిసిన విష‌యాలే.

ఈ వ్యవ‌హారం వెనుక సీఎం త‌న‌యుడు లోకేష్‌, ప‌లు చాన‌ళ్ల య‌జ‌మానుల హ‌స్తం ఉంద‌ని ప‌వ‌న్ చేసిన ట్వీట్లు ప్రకంప‌న‌లు సృష్టించాయి. ఆ త‌ర్వాత చాన‌ళ్ల అత్యుత్సాహంపై ప్రజ‌ల నుంచి వ్యతిరేకత, రాజ‌కీయ రంగు పులుముకుని కాస్టింగ్ కౌచ్ స‌మ‌స్య ప‌క్కదారి ప‌డుతుండ‌టంతో కొంతమంది జోక్యంతో చ‌ర్చలు ముగిశాయి. ఈ ప‌రిస్థితుల్లో త‌మిళంలో శ్రీ‌రెడ్డి వ్యక్తిగ‌త జీవితంపై రెడ్డి డైరీ పేరుతో సినిమా తీస్తున్నట్టు ద‌ర్శకుడు వివ‌రాలు వెల్లడించ‌డంతో ఈసారి శ్రీ‌రెడ్డి మ‌రేం సంచ‌ల‌నం సృష్టిస్తుందోన‌నే భ‌యం తెలుగుతో పాటు త‌మిళ సినిమా ప‌రిశ్రమ‌లో ఉత్కంఠ‌ను రేపుతోంది.

ద‌ర్శకుడి స‌మ‌క్షంలో శ్రీ‌రెడ్డి మాట్లాడిన మాట‌లు సినీ ప‌రిశ్రమ‌ను షేక్ చేస్తున్నాయి. ఏ వీడియోలో ఎవ‌రి జాతకం ఉందోన‌నే ఆందోళ‌న నెల‌కొంది. కాస్టింగ్ కౌచ్ వివాదం త‌ర్వాత శ్రీ‌రెడ్డి నుంచి ఫోన్ కాల్ వ‌చ్చిందంటే ద‌ర్శకులు, నిర్మాత‌లు వ‌ణకి చ‌స్తున్నారు. ఆమెకు సినిమా అవ‌కాశాలు ఇస్తే ఇబ్బందులు ఎటువైపు నుంచి వ‌స్తాయోన‌నే ఆందోళ‌నతో శ్రీ‌రెడ్డిని దూరంగా పెట్టారు. దీంతో ఆమెలో మ‌రింత క‌సి పెరిగింది.

త‌న‌ను ఆద‌రించ‌ని వారి గౌర‌వాన్ని తానెందుకు కాపాడాల‌ని ఆలోచ‌న‌లో ఆమె ఉన్నార‌ని తెలిసింది. దీంతో రెడ్డిడైరీ చిత్రం ఏ మ‌లుపు తిరుగుతుందోన‌నే ఆందోళ‌న సినీ ప‌రిశ్రమ‌లో కాక రేపుతోంది. మొత్తానికి శ్రీ‌రెడ్డి సినిమా ఇప్పుడిప్పుడే ముగింపు ప‌లికేలాలేదు. విడ‌త‌ల వారీగా జ‌నాన్ని రంజింప చేస్తూనే ఉంటుందా?