పేరుకు చిన్నల్లుడే కానీ పెద్ద ముదురే!

బాలకృష్ణ పెద్ద అల్లుడు లోకేష్ ఎప్పుడూ వార్తల్లో కనిపిస్తారేంటి? ఆయన చిన్నల్లుడు ఎందుకని పెద్దగా వార్తల్లో కనిపించరు? ఇకపై ఇలాంటి అనుమానాలు అక్కర్లేదు. మొన్న ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన బాలయ్య చిన్నల్లుడు భరత్,…

బాలకృష్ణ పెద్ద అల్లుడు లోకేష్ ఎప్పుడూ వార్తల్లో కనిపిస్తారేంటి? ఆయన చిన్నల్లుడు ఎందుకని పెద్దగా వార్తల్లో కనిపించరు? ఇకపై ఇలాంటి అనుమానాలు అక్కర్లేదు. మొన్న ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన బాలయ్య చిన్నల్లుడు భరత్, ఇప్పుడు రుణాల ఎగవేత విషయంలో హాట్ టాపిక్ గా మారారు.

అవును.. హైదరాబాద్ అబిడ్స్ కు చెందిన కరూర్ వైశ్యాబ్యాంక్ భరత్ కుటుంబీకులకు జప్తు నోటీసు జారీచేసింది. తమకు ష్యూరిటీగా పెట్టిన గాజువాక, భీమిలి ప్రాంతాల్లోని భూముల్ని జప్తు చేస్తామనేది ఆ నోటీసు సారాంశం. ఇంతకీ మేటర్ ఏంటంటే.. ఈ భూముల్ని ష్యూరిటీగా పెట్టి, టెక్నో ఇన్ ఫ్రా టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట రుణం తీసుకుంది భరత్ కుటుంబం. అది వడ్డీతో కలిపి ఇప్పటికి 124 కోట్ల 39 లక్షలు అయింది.

ఎన్ని రిమైండర్లు ఇచ్చినా రుణాన్ని చెల్లించేందుకు భరత్ ముందుకు రాలేదు. దీంతో ష్యూరిటీ కింద ఇచ్చిన ఆస్తుల్ని జప్తు చేయబోతున్నట్టు నోటీసులు ఇచ్చింది కరూర్ వైశ్యాబ్యాంక్. నిజానికి భరత్ కు ఈ తరహా అనుభవం ఇదే తొలిసారి కాదంటున్నారు. గతంలో ఆంధ్రాబ్యాంక్ కు ఈయన వంద కోట్ల రూపాయల వరకు రుణాలు ఎగ్గొట్టినట్టు వార్తలు వచ్చాయి.

ఇవన్నీ ఒకెత్తయితే.. గతంలో ఎంపీ విజయసాయిరెడ్డికి భరత్ కు మధ్య రుణాల ఎగవేతకు సంబంధించి ఆసక్తికర చర్చ జరిగింది. శ్రీభరత్ కుటుంబం ఆంధ్రాబ్యాంక్ కు 13 కోట్ల రూణాన్ని ఎగవేశారంటూ విజయసాయి ఆరోపించారు. దీనిపై అప్పట్లో భరత్ స్పందించారు. ఏపీ ట్రాన్స్ కో నుంచి తమకు 3 కోట్ల రూపాయల బకాయిలు రావాలని, అవి వస్తే ఇవి తీరుస్తామంటూ కాస్త సెటైర్లు వేసే ప్రయత్నం చేశారు.

ఇప్పుడు ఏకంగా కరూర్ వైశ్యాబ్యాంక్ 124 కోట్ల రూపాయలకు సంబంధించి ఏకంగా జప్తు నోటీసు ఇచ్చింది. పూర్తిగా సాక్ష్యాలతో పాటు పేపర్ లో ప్రకటన ఇచ్చింది. మరి దీనిపై కూడా భరత్ సెటైర్లు వేస్తారేమో చూడాలి.

నాకు ఆ అలవాటు లేదు