నలభై మూడేళ్ల అనుభవం తరువాత వచ్చింది గాలి సంపత్ లాంటి పాత్ర. బహుశా భగవంతుడు నా నటన ఇన్నాళ్లు చూసి, డిసైడ్ చేసుకున్నాక, నాకు ఈ పాత్ర ఇచ్చి వుంటాడు అన్నారు నటుడు రాజేంద్ర ప్రసాద్.
“గాలి సంపత్ సినిమా చూశాక జీవితంలో నాకు రెండు మూడు విషయాలు అర్ధమయ్యాయి. జీవితంలో మనం ఏం చేసినా, అది భగవంతుడు మనకు ఇచ్చే అవకాశం. అది రానిదే ఎవరూ జీవితంలో ఏమీ చేయలేరు. 44 సంవత్సరాల సినిమా జీవితం.. నన్ను నటుడిగా నిలబెట్టిన మొదటి సినిమా లేడిస్ టైలర్.
ఆ సినిమా లేకపోతే నేను లేను. నా లాంటి కళాకారుడికి గాలి సంపత్ సినిమా ద్వారా ఒక అవకాశం రావడం.. మరి ముఖ్యంగా టెస్ట్ లు చేసి చేసి 43 సంవత్సరాలు నన్ను చూసి రాసినట్టున్నాడు సాయి అనబడే ఎస్.కృష్ణ.
నా జీవితంలో జన్మాంతం నటుడిగా గుర్తించుకునే ఒక అద్భుతమైన కథ రాశారు సాయి. ఆ కథకి ఆయన్నే నిర్మాతగా మార్చారు నన్ను డాడీ అని పిలిచే అనిల్ రావిపూడి. అద్భుతాలు జరుగుతాయి అది కూడా యాక్సిడెంల్ గా జరుగుతాయి అని ఈ సినిమా చేశాక నాకు అర్ధమైంది. ఈ కథ చెప్పగానే నేను భయపడ్డాను. మాటలు లేకుండా ఎలా అనుకున్నాం. కానీ కరోనా తర్వాత టీమ్ మొత్తం ఫుల్ ఎనర్జీతో పాత్రను తీర్చిదిద్దారు.
ఈ కథలో నాకు చాలా చాలా ఇష్టంగా కష్టపడుతున్నప్పటికీ కూడా అది కూడా ఎంతో గొప్ప అవకాశం కాబట్టి చేసేశాను. నాకు ఈ సినిమాలో కో ఆర్టిస్టుల వల్ల చాలా హెల్ప్ జరిగింది ముఖ్యంగా నా కొడుకు శ్రీవిష్ణు. నిజంగా ఈ సినిమా చూసిన తరువాత మేమిద్దరం నటించామని చెప్పరు. నా జీవితంలో మర్చిపోలేని సినిమా ఇది. గాలి సంపత్ నా జీవితంలో ఒక ఆణిముత్యం“ అన్నారు.