ఎక్స్ క్లూజివ్-ఎఫ్ 3 లో మహేష్

నమ్మడానికి కాస్త అనుమానంగా వుండే వార్త ఇది. అనిల్ రావిపూడి డైరక్షన్ లో నిన్లాత దిల్ రాజు నిర్మించే ఎఫ్ 3 సినిమాలో హీరో మహేష్ బాబు నటించబోతున్నారు. అయితే మహేష్ బాబు పాత్ర…

నమ్మడానికి కాస్త అనుమానంగా వుండే వార్త ఇది. అనిల్ రావిపూడి డైరక్షన్ లో నిన్లాత దిల్ రాజు నిర్మించే ఎఫ్ 3 సినిమాలో హీరో మహేష్ బాబు నటించబోతున్నారు. అయితే మహేష్ బాబు పాత్ర ఫుల్ లెంగ్త్ వుండకపోవచ్చు.  ముఫై నుంచి నలభై నిమషాలు మాత్రం వుండే అవకాశం వుంది. ప్రస్తుతానికి ఇది ఎర్లీ స్టేజ్ లో వుంది.

విక్టరీ వెంకటేష్-వరుణ్ తేజ్ ఇప్పటికే ఫిక్స్ అయిన హీరోలు. వెంకటేష్ ఓకె నే కానీ రెమ్యూనిరేషన్ విషయంలో సురేష్ బాబు దగ్గర పంచాయతీ నడుస్తోంది. ఒకటి రెండురోజుల్లో అది పరిష్కారం అయిపోతుందని దిల్ రాజు ధీమాగా వున్నారు. ఇంకో హీరో కావాలి. దానికి మహేష్ ను ఒప్పించాలనుకుంటున్నారు.

మహేష్-వంశీ పైడిపల్లి సినిమా 2021 సమ్మర్ కే. ఈ లోగా దాదాపు ఏడాదిన్నర పాటు మహేష్ సినిమా వుండదు. అందువల్ల అలా కాకుండా తక్కువ టైమ్ లో, ఈ సినిమా ముందుగా జూన్ నుంచి మొదలు పెట్టి, మహేష్ పాత్రను ఓ ఇరవై రోజుల్లో ఫినిష్ చేసేస్తామని చెప్పి, దిల్ రాజు ఆయనను ఒప్పించే ఆలోచనలో వున్నారు. 

మహేష్ ఓకె  అన్నదాన్ని బట్టి మిగిలిన వ్యవహారం వుంటుంది. 

కులాలకు సంబంధించి  త్వరలో పుస్తకం రాస్తాను