వరల్డ్ ఫేమస్ ఎమోషన్స్

వరల్డ్ ఫేమస్ లవర్ ట్రయిలర్ వచ్చేసింది. లుక్స్, యాక్టింగ్ పరంగా మరోసారి అర్జున్ రెడ్డిని గుర్తుచేశాడు విజయ్ దేవరకొండ. కానీ వేరియేషన్స్ చూపించడంలో మాత్రం వరల్డ్ ఫేమస్ లవర్ సక్సెస్ అయ్యాడు. ముగ్గురు అమ్మాయిల…

వరల్డ్ ఫేమస్ లవర్ ట్రయిలర్ వచ్చేసింది. లుక్స్, యాక్టింగ్ పరంగా మరోసారి అర్జున్ రెడ్డిని గుర్తుచేశాడు విజయ్ దేవరకొండ. కానీ వేరియేషన్స్ చూపించడంలో మాత్రం వరల్డ్ ఫేమస్ లవర్ సక్సెస్ అయ్యాడు. ముగ్గురు అమ్మాయిల దగ్గర మూడు విధాలుగా ప్రవర్తించడమే కాకుండా.. డైలాగ్ డెలివరీలో కూడా కాస్త తేడా చూపించాడు. అదే ఈసారి విజయ్ దేవరకొండ నుంచి కూసింత కొత్తగా కనిపించిన అంశం.

ఒకహీరో, ముగ్గురు నలుగురు హీరోయిన్ల కాన్సెప్టులు తెలుగుతెరకు కొత్తకాదు. ఈసారి ఈ కాన్సెప్ట్ ను దేవరకొండ కూడా ట్రై చేశాడు. కాకపోతే దానికి తన మార్క్ యాడ్ చేశాడు. సినిమాలో బోల్డ్ సీన్స్ పుష్కలంగా ఉన్నాయనే విషయం ట్రయిలర్ చూస్తే అర్థమౌతోంది. ఈసారి లిప్ కిస్సులు దాటి దేవరకొండ ట్రై చేసినట్టు కనిపిస్తోంది. ఇక హీరోయిన్ల విషయానికొస్తే.. ఐశ్వర్య రాజేష్ క్యారెక్టర్ లో కాస్త డెప్త్ కనిపిస్తోంది. రాశిఖన్నా పాత్రలో కూడా ఎమోషన్స్ చూపించారు.

అంతా బాగానే ఉంది కానీ, ఆల్రెడీ పెళ్లయిన హీరో.. మిగతా ముగ్గురు అమ్మాయిలతో ఎందుకు కనెక్ట్ అయ్యాడు. వాళ్లకు ఏం చెప్పి కమిట్ చేశాడనేది సస్పెన్స్. అయితే చుట్టూ తిరిగి క్లైమాక్స్ కు వచ్చేసరికి పెళ్లి గొప్పదనం, భారతీయ సంప్రదాయం, ఆడపిల్ల-అపురూపం లాంటి రొటీన్ కాన్సెప్టును చెబుతారేమో అనిపిస్తోంది.

ఈ సంగతి పక్కనపెడితే.. ట్రయిలర్ లో ప్రొడక్షన్ వాల్యూస్, గోపీసుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. క్రాంతిమాధవ్ డైరక్ట్ చేసిన ఈ సినిమా ప్రేమికుల రోజు కానుకగా ఈనెల 14న థియేటర్లలోకి వస్తోంది.