తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి ఇంటి మీద ఐటీ శాఖ అధికారులు గురువారం రైడ్స్ నిర్వహించారు. కడపలోని ఆయన ఇంట్లోనూ, హైదరాబాద్ లోని ఆయన ఆఫీసుల మీద ఐటీ రైడ్స్ జరగడం గమనార్హం. తెలుగుదేశం పార్టీకి తాడూ బొంగరం లేని కడప జిల్లాలో దానికి అధ్యక్షుడుగా ఉన్నారు శ్రీనివాసులు రెడ్డి. ఈయన ఒక పలు కాంట్రాక్ట్ వర్క్స్ కూడా చేసినట్టుగా తెలుస్తోంది.
కడప జిల్లాలో ఉంటూ జగన్ ను తిట్టాలనే చంద్రబాబు నాయుడు పని చేసి పెట్టాలంటే రాజకీయంగా ఎలాగూ అవకాశం ఉండదు, కాంట్రాక్టులు అయినా ఉండాలి కదా! ఈ నేపథ్యంలో శ్రీనివాసులు రెడ్డి పలు కాంట్రాక్ట్ వర్క్స్ చేసినట్టుగా తెలుస్తోంది. జార్ఖండ్ వరకూ ఈయన పనులు చేశారట. అందుకు సంబంధించిన పన్నుల చెల్లింపులు అవకతవకలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.
అందుకే శ్రీనివాసులు రెడ్డి ఇంటి మీద, ఆఫీసుల్లోనే ఐటీ రైడ్స్ జరుగుతున్నట్టుగా భోగట్టా. ఇందుకు సంబంధించి పూర్తి కమామీషును ఐటీ అధికారులే ప్రకటించాల్సి ఉంది. ఒకవైపు చంద్రబాబు నాయుడి మాజీ పీఏ శ్రీనివాస్ ఇంటి మీద ఐటీ రైడ్స్, మరోవైపు శ్రీనివాసులు రెడ్డి కూడా ఐటీ టార్గెట్ లో నిలవడం ఆసక్తిదాయకంగా మారింది.