చంద్రబాబు పీఏ ఆస్తి రూ.150 కోట్లు!?

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయన వద్ద పీఏగా పనిచేశారు శ్రీనివాస్. ఇప్పుడు అదే శ్రీనివాస్ ఇంటిపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడి చేశారు. విజయవాడతో పాటు హైదరాబాద్ లోని చంపాపేట్ లో ఉన్న ఆయన…

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయన వద్ద పీఏగా పనిచేశారు శ్రీనివాస్. ఇప్పుడు అదే శ్రీనివాస్ ఇంటిపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడి చేశారు. విజయవాడతో పాటు హైదరాబాద్ లోని చంపాపేట్ లో ఉన్న ఆయన నివాసం, ఆఫీసులపై అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి జరుగుతున్న ఈ తనిఖీల్లో దాదాపు 150 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు, డాక్యుమెంట్లను అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది.

శ్రీనివాస్ సెక్రటేరియట్ లో ఉద్యోగి. గత ఏడాది వరకు ఆయన చంద్రబాబు వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశారు. ఆ కాలంలో ఆయన భారీ ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టారనే అభియోగాలున్నాయి. ఏకంగా ఐటీ అధికారులు దాడులు నిర్వహించడంతో, ఈ అభియోగాలు-ఊహాగానాలకు మరింత ఊతమిచ్చినట్టయింది.

విజయవాడ, హైదరాబాద్ లో శ్రీనివాస్ కు పలు ఇళ్లు ఉన్నట్టు గుర్తించారు అధికారులు. మరోవైపు రకరకాల పేర్లతో ఆయన పలు కంపెనీలు కూడా స్థాపించినట్టు తెలుస్తోంది. ఆ కంపెనీలకు సంబంధించిన లావాదేవీలు సక్రమంగా లేవని ప్రాధమికంగా నిర్థారించారు ఐటీ ఆఫీసర్లు.

సచివాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి, చంద్రబాబు వద్ద సహాయకుడిగా మారిన వెంటనే వందల కోట్ల రూపాయలకు అధిపతిగా మారడంతో అంతా అవాక్కయ్యారు. రేపటి కల్లా శ్రీనివాస్ కు ఐటీ నోటీసులు అందిస్తామంటున్నారు అధికారులు. అప్పుడు అసలైన ఎమౌంట్ బయటకొచ్చే అవకాశం ఉంది

కులాలకు సంబంధించి  త్వరలో పుస్తకం రాస్తాను