చిక్కిపోయిన చంద్రబాబు

చంద్రబాబు ఎలా వుంటారు? వయసు మీదపడినా హుందాగా, స్టిఫ్ గా, అస్సలు నీరసం అన్నది తెలియకుండా కనిపిస్తారు. మడత నలగని దుస్తులతో, వాడని మొహంతో వుంటారు. కానీ ఇప్పుడు ఆయన క్యారెక్టర్ ను ఎన్టీఆర్…

చంద్రబాబు ఎలా వుంటారు? వయసు మీదపడినా హుందాగా, స్టిఫ్ గా, అస్సలు నీరసం అన్నది తెలియకుండా కనిపిస్తారు. మడత నలగని దుస్తులతో, వాడని మొహంతో వుంటారు. కానీ ఇప్పుడు ఆయన క్యారెక్టర్ ను ఎన్టీఆర్ బయోపిక్ లో హీరో రానా పోషిస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. సరే, మేకప్ ఎలా వుంటుంది? రానా ఏ విధంగా చంద్రబాబుగా మారతారు అన్నది అంతా మేకప్ మీద, సిజి వర్క్ మీద ఆధారపడి వుంటుంది.

అయితే ఈలోగా రానా కేవలం చంధ్రబాబు పాత్ర కోసం మేకోవర్ అవుతున్నారని, బరువు తగ్గి, బాగా చిక్కారని యూనిట్ జనాలు ఫీలర్లు వదులుతున్నారు. ఇవి చూస్తేనే ఫన్నీగా వుంది. రానా ఆరోగ్య సమస్య ఏమిటి అన్నది అఫీషియల్ గా ఎవరికీ తెలియకపోయినా, ఆయన బాగా చిక్కిపోయారన్న సంగతి మాత్రం అందరికీ తెలుసు. ఆ మధ్య చైతూ-వెంకీ సినిమా ఓపెనింగ్స్ లో బయట ఫొటోగ్రాఫర్లను రానివ్వకుండా, రానాకు ఎక్కువగా ఫొటోలు తీయనివ్వకుండా తండ్రి సురేష్ బాబు చాలా జాగ్రత్తలు తీసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి.

కానీ ఇప్పుడు మాత్రం రానా చిక్కిపోయింది అంతా కేవలం చంద్రబాబు పాత్ర మేకోవర్ కోసమే అని ఫీలర్లు వదలడం విశేషం. కానీ చంద్రబాబు మరీ అంత చిక్కిపోయి, మొహం పలుచగా సాగిపోయి వుండరు. 70ఏళ్ల వయసు దగ్గరకు వస్తున్నా, ఫుల్ హెల్తీగా కనిపిస్తారు. అంటే ఇప్పుడు హీరోయిన్లకు ప్యాడింగ్, డిజిటల్ కరెక్షన్ చేసినట్లు, రానాను చంద్రబాబుగా మార్చడానికి అన్నీ చేయాల్సి వస్తుందేమో?