Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అరవిందసమేత టీజర్ 58 సెకెండ్లు

అరవిందసమేత టీజర్ 58 సెకెండ్లు

ఎన్టీఆర్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీజర్ ఆగస్టు 15న వస్తోంది. అరవింద సమేత టీజర్ కోసం త్రివిక్రమ్ అభిమానులు కూడా ఆసక్తిగానే వున్నారు. ఇప్పటికే దాదాపు ఫినిషింగ్ స్టేజ్ కు వచ్చిన టీజర్ ప్రస్తుతం మ్యూజిక్ డైరక్టర్ థమన్ దగ్గర ఫినిషింగ్ స్టేజ్ లో వున్నట్లు తెలుస్తోంది. 

టీజర్ ఎలా వుంటుందనే దానిమీద ఇండస్ట్రీలో కొన్ని గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. టీజర్ దాదాపు 55 నుంచి 58 సెకెండ్లు వుంటుందని తెలుస్తోంది. సినిమా కథకు సంబంధించిన ఫాస్ట్.. ప్రెజెంట్.. ఫ్యూచర్ మూడు అంశాలు కవర్ అవుతాయని విశ్వసనీయ వర్గాలబోగట్టా. అలాగే టీజర్ లో జగపతిబాబుకు ఓ డైలాగు, ఎన్టీఆర్ కు రెండు డైలాగులు వుండే అవకాశం వుందని తెలుస్తోంది.

అరవింద సమేత సినిమాలో జగపతిబాబు విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ కు సంబంధించిన కొన్ని సెకెండ్ల బిట్ మీద మాత్రం ఇంకా ఫైనల్ డెసిషన్ జరగలేదని తెలుస్తోంది. ఏమైనా అరవింద సమేత సినిమా మీద టాలీవుడ్ కూడా ఆసక్తిగా వుంది. ఎందుకంటే 2018లో ద్వితీయార్థంలో వస్తున్న క్రేజీ కాంబినేషన్ భారీ మూవీ ఇది.

అందుకే అంత ఆసక్తి. అలాగే ఎన్నాళ్ల నుంచో ఈ కాంబినేషన్ గురించి ఎన్టీఆర్ అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. అలాంటి సినిమా టీజర్ ఆగస్టు 15న రాబోతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?