కేరళ రాష్ట్రంలో తుపాను సహాయ కార్యక్రమాలకు హీరో అల్లుఅర్జున్ పాతికలక్షలు విరాళం ప్రకటించాడు. ఇప్పటికే మరో హీరో విజయ్ దేవరకొండ అడుగు ముందుకు వేసి అయిదు లక్షలు ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే బన్నీ సంగతి వేరు. బన్నీ అంటే మళయాళం జనాలకు తమ స్వంత హీరో కింద లెక్క. అంతగా ఓన్ చేసుకున్నారు వారు.
అందుకే బన్నీ తనవంతు సాయంగా పాతికలక్షలు ప్రకటించాడు. ఈ సాయంత్రం ట్విట్టర్ లో ఈ మేరకు ఓ ప్రకటన చేసాడు. బన్నీ సినిమాలకు కేరళ రాష్ట్రంలో మంచి ఆదరణ వుంది. అందుకే ఈ విరాళం ప్రకటించడం అన్నది కచ్చితంగా చేయాల్సిన పని.
గతంలో కూడా పలుసార్లు బన్నీ ఇలాంటి సమస్యలు వచ్చినపుడు తనవంతు సాయం ప్రకటిస్తూ వస్తున్నాడు. విజయ్ దేవరకొండ, బన్నీల వరుసలో మరికొందరు హీరోలు కూడా సహాయం ప్రకటించేలాగే వున్నారు. ఎవరు? ఎంత? అన్నది తెలియాల్సి వుంది.