Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'అల్లుడు' కోసం మంగ్లి పాట

'అల్లుడు' కోసం మంగ్లి పాట

మంగ్లీ అంటే తెలంగాణ జానపద సంగీతాభిమానులకు సుపరిచమైన పేరు. అనేక కళారూపాల ద్వారా మంగ్లీ పేరు తెలంగాణ అంతటా బాగా పాపులర్. తనదైన స్వరంతో ఆమె పాడిన పాటలు యూట్యూబ్ లో బాగా చలామణీ అవుతుంటాయి. అలాంటి గాయనిని సినిమాకు కూడా పరిచయం చేస్తున్నారు.

మంగ్లీతో ఓ పాటను శైలజారెడ్డి అల్లుడు సినిమాకోసం పాడించారు. గోపీసుందర్ సంగీత దర్శకత్వంలో తయారైన ఈపాట హుషారుగా సాగుతుంది. అయితే ఈ పాట డ్యూయట్ కాదు. ఓ విధమైన మాంటేజ్ సాంగ్ అనుకోవాలి. అటు అత్త రమ్యకృష్ణ, ఇటు ప్రియురాలు అను ఇమ్మాన్యుయేల్ కు నడుమ హీరో నాగచైతన్య నలిగిపోతుంటే, ఆ నేపథ్యంలో వచ్చే సరదా సాంగ్.

'శైలజారెడ్డి అల్లుడు చూడు' అంటూ సాగే ఈ పాట ఫుల్ ఫోక్ జోష్ తో సాగుతుందట. ఇప్పటికే  శైలజారెడ్డి అల్లుడు సినిమాలో ఓ పాటను విడుదలచేసారు. ఇప్పుడు ఆగస్టు 16న మరో పాటగా ఈ మంగ్లి పాడిన సాంగ్ ను విడుదలచేయబోతున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈసినిమా ఆగస్టు 31న విడుదలవుతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?