శ్రీనివాసకళ్యాణం ఫస్ట్ వీకెండ్ సరే..

శ్రీనివాస కళ్యాణం ఈ మధ్యకాలంలో మాంచి పాజిటివ్ బజ్ తో విడుదలైన సినిమా. అయితే ఆ పాజిటివ్ బజ్ మేరకు సినిమాకు క్రిటిక్స్ అప్రిసియేషన్ రాలేదు. సినిమాను నిరుత్సాహపర్చడమే అందుకు కారణం. అయితే సినిమాకు…

శ్రీనివాస కళ్యాణం ఈ మధ్యకాలంలో మాంచి పాజిటివ్ బజ్ తో విడుదలైన సినిమా. అయితే ఆ పాజిటివ్ బజ్ మేరకు సినిమాకు క్రిటిక్స్ అప్రిసియేషన్ రాలేదు. సినిమాను నిరుత్సాహపర్చడమే అందుకు కారణం. అయితే సినిమాకు కాస్త ఎక్కువ హైప్ ఇచ్చామని, అందువల్ల జనం కాస్త డిస్సపాయింట్ అయ్యారని, అయితే ఆ తరువాత మళ్లీ కలెక్షన్లు బాగున్నాయని నిర్మాత దిల్ రాజు చెప్పేసారు. ఆయన మాట ఎలా వున్నా, విశ్వరూపం 2 విడుదల అయిన శుక్రవారం మినహా మిగిలిన మూడురోజులు శ్రీనివాస కళ్యాణం కలెక్షన్లు బాగున్నాయి.

ముఖ్యంగా ఫ్యామిలీలు దూరంగా వుండే మార్నింగ్ షో లు డల్ గా వుంటున్నాయి. మిగిలిన షోలు బాగున్నాయి. ఏమైతేనే మొత్తంమీద ఫస్ట్ వీకెండ్ నాలుగురోజులకు కలిపి దగ్గర దగ్గర రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిదిన్నర కోట్లు వసూలు చేసింది. శ్రీనివాస కళ్యాణం సినిమాల అమ్మకాలతో పోలిస్తే ఈ కలెక్షన్లు కాస్త తక్కువే. ఎందుకంటే సాధారణంగా ఫస్ట్ వీకెండ్ లో సగం మొత్తం వసూలు చేస్తే, ఫుల్ రన్ లో మిగిలిన సగం వస్తుందని అంచనా.

కానీ శ్రీనివాస కళ్యాణం ఒక్క నైజాంలో మినహా మిగిలిన ఏ ఏరియాలో కూడా సగం మొత్తం వసూలు చేయలేదు. కొన్నిచోట్ల పాతికశాతం, మరి కొన్నిచోట్ల మూడోవంతు వసూలు చేసింది. ఎంత వసూలు చేసినా, మూడురోజులే మిగిలి వుంది. బుధవారం నుంచి గీత గోవిందం ధియేటర్లలోకి వస్తుంది. ఈ పరిస్థితి ఊహించే కావచ్చు. గీత గోవిందం సినిమాను మరోవారం వెనక్కు పంపేందుకు ఆయన విశ్వ ప్రయత్నం చేసారు.

కానీ వాళ్లకు ఇక మరో ఆప్షన్ లేక, దిల్ రాజు కోరిక మన్నించలేదు. మరి ఆ ఎఫెక్ట్ ఎలా వుంటుందో చూడాలి,. తొలి వీకెండ్ కలెక్షన్ల వివరాలు ఇలా వున్నాయి.

నైజాం…………….3.80
సీడెడ్………………1.15
ఉత్తరాంధ్ర…………1.05
ఈస్ట్……………….0.60
వెస్ట్………………..0.40
కృష్ణ………………..0.49
గుంటూరు…………0.64
నెల్లూరు……………0.26