పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికి మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చారు. ఒక పెళ్లి విషయంలో కోర్టు మెట్లుఎక్కారు. ఇవి అందరికీ తెలిసిన విషయాలే. అయితే పవన్ పెళ్లిళ్లు ఇలా ఎందుకు పెటాకులు అయ్యాయన్నది మాత్రం ఎవరికీ క్లారిటీగా తెలియదు. ఆయనకు ఆయన భార్యలకు మాత్రమే తెలిసిన విషయాలు అవి.
అయితే పవన్ వెస్ట్ గోదావరి పర్యటనలో చెప్పిన ఒక విషయం ఆసక్తికరంగా వుంది. పైగా ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా టీమ్ ట్విట్టర్ లో కూడా పెట్టింది. ''….. నా జీవితంలో పార్టీలు, పబ్ లు వుండవు. ఒక గదిలో కూర్చుని పుస్తకాలు చదువుకుంటాను. ఎప్పుడు చూసినా, ఆవులు, గేదెలతో వుంటాను. మరి ఇలాంటి వాడితో సుఖం ఎక్కడ వుంటుంది? అందుకే నా వ్యక్తిగత జీవితం ఇలా చిన్నాభిన్నం అయిపోయింది….''
నిడదవోలు సభలో పవన్ వ్యాఖ్యలు ఇవి. ఇవే ట్విట్టర్లో వుంచినవి కూడా. అంటే రెండు పెళ్లిళ్లు విషాదాంతం కావడం వెనుక తప్పు పవన్ ది కాదు, ఆయన లైఫ్ స్టయిల్ నచ్చని ఆయన మాజీ భార్యలది అని అనుకోవాలి. మరి ఇంత తెలిసిన పవన్ తన లైఫ్ స్టయిల్ ను భార్యలకు అనుగుణంగా కాస్తయినా ఎందుకు మార్చుకోలేదు? పెళ్లిళ్లను కాపాడుకోవాలని ఎందుకు అనుకోలేదు?
సరే ఆ విషయం పక్కనపెడితే తొలి మ్యారేజ్ ఫెయిల్ అయిన తరువాత, కారణం తెలిసిన తరువాత మలి మ్యారేజ్ విషయంలో ఎందుకు జాగ్రత్త పడలేదు. పోనీ అదీ ఫెయిల్ అయ్యాక, మూడోపెళ్లి ఎందుకు చేసుకున్నట్లు? పోనీ ఇఫ్పుడయినా జాగ్రత్తపడి, అప్పుడప్పుడు ఓ పబ్ కు తీసుకెళ్తున్నారా? పుస్తకాలు, ఆవులు, గేదెలు కాకుండా, ఆవిడ సంగతి కూడా పట్టించుకుంటున్నారా?
లేదూ అంటే మళ్లీ సమస్య మొదటికి వస్తుందేమో? మన అనుమానం కాదు. పవన్ చెప్పిన విషయం. అవును, పవన్ ఇలా చెప్తున్నారు. మరి రేణుదేశాయ్ ఏమిటి? అలా చెబుతోంది. తనకు విడాకులు ఇవ్వకుండానే మరో మహిళతో సంసారం చేసారని, బిడ్డను కన్నారని? ఈయనేమో తనది సన్యాసం టైపు జీవితం అంటున్నాడు. ఆవిడేమో? సన్యాసి కాదు, భార్య వుండగానే మరో మహిళతో సంసారి అంటోంది? ఏది నిజమో?