ఇప్పటివరకు గీతగోవిందం సినిమాపై ఓ క్లీన్ ఇమేజ్ ఉండేది. టైటిల్ కు తగ్గట్టే ఇదొక మంచి లవ్ ఎంటర్ టైనర్ అని, ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని అంతా భావించారు. కానీ తాజాగా జరిగిన లీకుల ద్వారా వచ్చిన ఓ క్లిప్ మాత్రం ఆడియన్స్ ను దాదాపు షాక్ కు గురిచేసింది.
అవును.. అర్జున్ రెడ్డికి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో గీతగోవిందం సినిమాలో ఓ లిప్ కిస్ ఉంది. బస్సులో ప్రయాణిస్తూ ఓ రకమైన మైకంలో హీరోయిన్ ను హీరో ముద్దాడుతాడు. ఇది టీజర్ లో ఉంది. కానీ అది జస్ట్ శాంపిల్ మాత్రమే. సినిమా క్లయిమాక్స్ లో ఏకంగా హీరోయిన్, హీరోను ముద్దాడుతుంది. అది కూడా సంసారపక్షంగా కాదు. కాస్త హద్దులు చెరిపేసేలా ఉన్న సీన్ అది.
బస్సులో హీరోపైన కూర్చొని, హీరోయిన్ అతడ్ని ముద్దాడే సీన్ అది. ఈ సీన్ మొత్తం లీక్ అయింది. మరుక్షణం అది వైరల్ కూడా అయింది. అయితే ఇప్పుడీ సీన్ ను సినిమాలో ఉంచుతారా లేక తీసేస్తారా అనే అంశంపై ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తోంది.
కొందరేమో ఈ సన్నివేశాన్ని డిలీటెట్ సీన్ గా చెప్పుకొస్తున్నారు. అది సినిమాలో లేదని, తర్వాత యూట్యూబ్ లో రిలీజ్ చేస్తారని అంటున్నారు. మరికొందరు మాత్రం సినిమాకు ఈ లిప్ కిస్ సీన్ తోనే శుభంకార్డు పడుతుందని అంటున్నారు.
ఏదేమైనా లీక్ అయిన ఈ సీన్ మాత్రం సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చింది. ఓ వైపు గీతగోవిందం సినిమా పైరసీ బారిన పడిందని యూనిట్ బాధపడుతున్నప్పటికీ, ఈ సీన్ మాత్రం వాళ్లకు పుష్కలంగా పబ్లిసిటీ చేసిపెడుతోంది.