బాహుబలి అడుగుల్లో ఎన్టీఆర్ బయోపిక్

సినిమాల ప్రచారంలో, మేకింగ్ లో బాహుబలిది ఓ కొత్త ట్రెండ్. సినిమాలోకి తమిళ, కన్నడ, ఇలా ఇతర భాషా నటులను తీసుకుని, సినిమాకు జాతీయస్థాయి మార్కెట్ సాధించడం ఒక స్ట్రాటజీ. అలాగే సినిమా విషయాలు…

సినిమాల ప్రచారంలో, మేకింగ్ లో బాహుబలిది ఓ కొత్త ట్రెండ్. సినిమాలోకి తమిళ, కన్నడ, ఇలా ఇతర భాషా నటులను తీసుకుని, సినిమాకు జాతీయస్థాయి మార్కెట్ సాధించడం ఒక స్ట్రాటజీ. అలాగే సినిమా విషయాలు ఒక్కొక్కటిగా స్మూత్ గా బయటకు వచ్చేలా చేసి, హైప్ పెంచుకుంటూ రావడం. ఆ విధంగా వేరే పబ్లిసిటీ అన్నది లేకుండా సినిమాకు కావాల్సినంత ప్రచారం సాధించారు.

ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ కూడా ఇదే దోవలో పయనిస్తోంది. ఇప్పటి వరకు సినిమాలో వీళ్లు వున్నారు, వీళ్లు వుంటారు అన్నది అఫీషియల్ గా చెప్పలేదు. విద్యాబాలన్ తో సహా అనేకమంది పేర్లు ముందుగా మీడియాలోనే లీక్ అయ్యాయి. చాలామంది వాళ్లంతట వాళ్లే సినిమాలో తాము ఫలానా క్యారెక్టర్ లో వున్నామని తెలిపారు. 

ఇక ఎన్టీఆర్ బయోపిక్ ను కూడా నేషనల్ మూవీ చేసేదిశగా చర్యలు తీసుకుంటున్నారు. వీలయినంత మంది తమిళ, కన్నడ, బాలీవుడ్ నటులను తీసుకునే ఆలోచనలు సాగుతున్నాయి. తెలుగులో మహేష్ బాబును ఆల్ మోస్ట్ ఒప్పించినట్లు తెలుస్తోంది. తెలుగు వెర్షన్ తో సమానంగా బాలీవుడ్ వెర్షన్ కు క్రేజ్ తీసుకురావాలని చూస్తున్నారు. విద్యాబాలన్ ను కీలకపాత్రకు తీసుకోవడం అందుకోసమే.

రాబోయే కొద్దిరోజుల్లో కన్నడ, తమిళ, బాలీవుడ్ నటుల పేర్లు బయటకు వస్తాయని తెలుస్తోంది. ఇవన్నీ బయటకు వచ్చాకే, అసలు సిసలు బజ్ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. ఇవన్నీ చూస్తుంటే మేకింగ్, పబ్లిసిటీలో బాహుబలిని, ప్లానింగ్ లో మహానటిని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది ఎన్టీఆర్ బయోపిక్.