Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వరుణ్ స్పేస్ మిషన్ స్టార్ట్స్

వరుణ్ స్పేస్ మిషన్ స్టార్ట్స్

హీరో వరణ్ తేజ్ తో ఫస్ట్ ఫ్రేమ్ సంస్థ నిర్మించే స్పేస్ సినిమా ఫస్ట్ లుక్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఈనెల 15న సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదలచేస్తాం అంటూ ఓ కాన్సెప్ట్ పోస్టర్ ను డిజైన్ చేసి వదిలారు. ఘాజీ సినిమాను అందించిన సంకల్ప్ రెడ్డి డైరక్షన్ లో ఫస్ట్ ఫ్రేమ్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. అంతరిక్షం, స్పేస్ షటిల్ ఆధారంగా తెలుగులో నిర్మించే తొలి సినిమా ఇది.

తన తొలి సినిమాను సముద్రంలో జలాంతర్గామి సెంటర్ పాయింట్ గా రూపొందించిన సంకల్ప్ రెడ్డి, రెండో సినిమాను అంతరిక్షం, స్పేష్ షటిల్ బ్యాక్ డ్రాప్ లో స్టార్ట్ చేసారు. ఈ సినిమాను నిర్మాత క్రిష్, ఆయన స్నేహితులు టేకప్ చేయడం విశేషం. సమ్మోహనం సినిమాలో మాంచి పర్ ఫార్మెన్స్ ఇచ్చిన అదితిరావ్ హైదరీ ఈ సినిమాలో కథానాయిక.

కాన్సెప్ట్ పోస్టర్ ను మాత్రం ఇప్పుడు వదిలారు. ఇందులో పెద్దగా ఏమీలేదు. టైటిల్, ఫస్ట్ లుక్ ఈనెల 15న ఇస్తాం అని మాములుగా చెప్పడానికి బదులు ఓ పోస్టర్ ను తయారుచేసి, వదిలారు. స్పేష్ షటిల్, స్పేష్ సూట్ లో వున్న వ్యక్తి స్టిల్ మాత్రమే ఇందులో వున్నాయి. వాస్తవానికి స్పేస్ షటిల్ అని గూగుల్ లో కోడితే ఇలాంటివి చాలా వుంటాయి. అలాంటిదే ఒకటి కలర్ ఫుల్ డిజైన్ చేసారు.

ఈ సినిమా మీద కాస్త ఆసక్తి వుంది. సంకల్ప్ రెడ్డి, క్రిష్ అండ్ కో పేర్లు, సబ్జెక్ట్ మీద ఆసక్తి కలిసి ఈ సినిమా మీద ఆసక్తి పెంచతున్నాయి. అందులోనూ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు ఏదో ఒక కొత్త పాయింట్ వుంటే తప్ప యాక్సెప్ట్ చేయడంలేదు సినిమాలను. ఆ విధంగా కూడా ఈ సినిమాకు పాజిటివ్ పాయింట్ వుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?