అడవి శేష్ నటించి, రూపకల్పనలో భాగస్వామ్యం వహించిన గూఢచారి సినిమా వన్ వీక్ దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఫస్ట్ వీక్ తో బ్రేక్ ఈవెన్ దశకు చేరుకోవడం విశేషం. సినిమా నిర్మాణానికి ఆరున్నర కోట్ల వరకు అయింది. థియేటర్ రైట్స్, మిగిలిన వ్యవహారాల ద్వారా నిర్మాతలు సేఫ్. ఓవర్ సీస్ కొన్న పీపుల్స్ మీడియా సంస్థ కూడా సేఫ్. మరి ఆంధ్ర, తెలంగాణ థియెటర్ హక్కలు కొన్న ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ అనిల్ సుంకర పరిస్థితి ఏమిటి? ఆయన కూడా సేఫ్ దిశగా వున్నారు.
సినిమాను నాలుగు కోట్లకు ఆంధ్ర, సీడెడ్, నైజాంకు ఆయన కొన్నారు. కానీ అసలు ఫిగర్ మూడున్నర కోట్లే అని గుసగుసలు వున్నాయి. అది వేరే సంగతి. నాలుగు కోట్లకు కొంటే, పబ్లిసిటీ, ఖర్చులు అన్నీకలిపి అయిదుకోట్ల వరకు అయింది. ఫస్ట్ వీక్ లో నైజాం, సీడెడ్, ఆంధ్ర కలిపి 4.60కోట్ల వరకు వచ్చేసింది. అందువల్ల ఆయన కూడా సేఫ్ దిశగా వున్నారన్నమాట. లేదూ గ్యాసిప్ ప్రకారం మూడున్నర కోట్లకే కొనివుంటే, ఇప్పటికే సేఫ్ అయిపోయినట్లు.
ఇప్పటికీ ఇంకా రోజుకు ఎంతోకొంత షేర్ వస్తోంది. పైగా కొన్ని ఏరియాలు ఆయన అమ్మారు. కాబట్టి మరి ఇబ్బంది లేదనే చెప్పాలి.
తొలివారం వసూళ్లు
నైజాం…………2.20
సీడెడ్………….0.40
ఉత్తరాంధ్ర…..0.56
ఈస్ట్…………..0.35
వెస్ట్……………020
కృష్ణ…………..0.46
గుంటూరు…….0.31
నెల్లూరు……….0.12