గీత గోవిందం సినిమా విడుదల ఇంకో నాలుగు రోజుల్లో వుంది. సాధారణంగా గీతా నిర్మాణ సంస్థ బడ్జెట్ దగ్గర చాలా జాగ్రత్తగా వుంటుంది. సినిమా బడ్టెట్ ను ఓ రేంజ్ దాటిపోనివ్వదు. కానీ ఈ సినిమాకు అలా జరగలేదు. కాస్త ఎక్కువే అయింది ఖర్చు. దానికి కారణం నిర్మాణ కాలం ఎక్కువ పట్టడం, సినిమాకు మధ్యలో కాస్టింగ్ మార్పులు, కథనం మార్పులు జరగడంతో కాస్త ఎక్కువ కాలంతో పాటు బడ్జెట్ పట్టింది. అర్జున్ రెడ్డి కన్నా ముందు అనుకున్న ప్రాజెక్ట్. అందుకే నిర్మాణ వ్యయం కాస్త ఎక్కువే అయింది.
పైగా అర్జున్ రెడ్డి సక్సెస్ తరువాత హీరో రెమ్యూనిరేషన్ మార్చారు. ఇలా అన్నీకలిసి 14కోట్లు వ్యయం అయింది గీత గోవిందం సినిమాకు. ఇక రివవరీ విషయానికి వస్తే.. గీతా సినిమా కాబట్టి శాటిలైట్, డిజిటల్ ఎప్పుడో అయిపోయింది. అది కూడా బజ్ రాకముందు. అందువల్ల కాస్త తక్కువ రేటుకే. సో, టోటల్ గా, ఓవర్ సీస్, శాటిలైట్, డిజిటల్ అన్నీకలిసి అయిదుకోట్లు రికవరీ వచ్చింది. ఇంకా తొమ్మిది కోట్లు రికవరీ కావాలి. వాస్తవానికి అమ్మేస్తే తొమ్మిది కోట్లు సమస్యకాదు. కానీ గీతా సంస్థ సినిమాను తెగించి నేరుగా విడుదల చేసుకుంటోంది.
ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కలిపి తొమ్మిది కోట్లు రికవరీ కావాలి. పెద్దగా రిస్క్ కాదనే అనుకోవాలి. ఇప్పటికి వున్న బజ్ చూస్తుంటే. సినిమా బాగుంటే సమస్యలేదు. నైజాంలోనే సగానికి పైగా రికవరీ అయిపోతుంది. విజయ్ దేవరకొండ సరసన రేష్మీ మడొన్నా నటించిన ఈ సినిమాకు పరుశురామ్ దర్శకుడు. గోపీసుందర్ సంగీతం అందించారు. బన్నీవాస్ నిర్మాత.