ఎన్టీఆర్ బయోపిక్ – ఎక్స్ క్లూజివ్ గ్యాసిప్

ఎన్టీఆర్ బయోపిక్ మీద ఎంతో క్యూరియాసిటీ వుంది సినిమా జనాల్లో. ఎందుకంటే మహానటి సినిమా చూసిన తరువాత బయోపిక్ ల మీద కాస్త ఆసక్తి వచ్చింది. ఎన్టీఆర్ లాంటి మహానటుడు, రాజకీయవేత్త జీవితాన్ని క్రిష్…

ఎన్టీఆర్ బయోపిక్ మీద ఎంతో క్యూరియాసిటీ వుంది సినిమా జనాల్లో. ఎందుకంటే మహానటి సినిమా చూసిన తరువాత బయోపిక్ ల మీద కాస్త ఆసక్తి వచ్చింది. ఎన్టీఆర్ లాంటి మహానటుడు, రాజకీయవేత్త జీవితాన్ని క్రిష్ లాంటి డైరక్టర్ ఎలా చెప్పబోతున్నాడా? అన్నది అత్యంత ఆసక్తికరమైన పాయింట్. అందునా ఎన్టీఆర్ బయోపిక్ కేవలం మాస్ జనాలనే కాదు, అభిమానులనే కాదు, మహిళలను కూడా ఆకట్టుకోవాలి.

అలా వుండాలంటే ఏం చేయాలి? అందుకే క్రిష్ తన అనుభవం అంతా రంగరించి, ఓ అద్భుతమైన స్క్రీన్ ప్లే అయిడియా వేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇండస్ట్రీలో గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. వాటి సారాంశం ఏమిటంటే..

అదేమిటంటే..
ఎన్టీఆర్ బయోపిక్ బసవతారకం పాయింట్ ఆఫ్ వ్యూలో వుంటుంది. అంటే ఎన్టీఆర్ కథను బసవతారకం చెబుతారన్నమాట. ఎన్టీఆర్ కు చాలాతక్కువ వయసులోనే అంటే 1942 టైమ్ లోనే పెళ్లి జరిగింది. ఎన్టీఆర్ కు బసవతారకంకూ బంధుత్వం కూడా వుందని అంటారు. సో, ఆ విధంగా వాళ్ల అరేంజ్డ్ మ్యారేజీ సంగతులు, ఇండస్ట్రీకి రావడం, సినిమాలు, రాజకీయాలు అన్నీ బసవతారకం యాంగిల్ లో స్టోరీ టెల్లింగ్ వుంటుందని తెలుస్తోంది.

బసవతారకం 1985లో మరణించారు. అంటే అప్పటికే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం, నాదెండ్ల వెన్నుపోటు, మళ్లీ దాన్ని అధిగమించి అధికారంలోకి రావడం జరిగిపోతాయి. అప్పుడు ఆమె మరణించారు. సో సినిమా ఆ విధంగా బసవతారకంతో మొదలై, బసవతారకంతో ముగుస్తుంది అన్నమాట.

హ్యాట్సాఫ్, క్రిష్ అనుకోవాలి. ఈ విధంగా స్క్రీన్ ప్లే ప్లాన్ చేసినందుకు. బహుశా అందుకే విద్యాబాలన్ ను తీసుకున్నది ఆ పాత్రకు. అంత ప్రాధాన్యత ఆ పాత్రకు వుంది కాబట్టే, విద్యాబాలన్ ను తీసుకున్నారు. ఇక సందేహంలేదు. కచ్చితంగా ఎన్టీఆర్ బయోపిక్, ఆకట్టుకునేలాగే వుంటుంది.