ఈ ఏడాది మూడే సినిమాలు ఆడాయని, రంగస్థలం, మహానటి, గూఢచారి అనీ ఓ స్టేట్ మెంట్ పడేసారు హీరో నాగ్. కానీ ఇంకా చాలా సినిమాలు ఈ ఏడాది మంచి డబ్బులు చేసుకున్నాయన్న సంగతి నాగార్జున మరిచిపోయినట్లుంది.
ఛలో సినిమా చిన్నగా విడుదలై పెద్ద హిట్ అయింది. భాగమతి మంచి లాభాలు ఆర్జించింది. తొలి ప్రేమ కూడా లాభాలే ఆర్జించింది. భరత్ అనే నేను యాభై రోజలు మాంచి రన్ తో ఆడింది. ఇక ఆర్ ఎక్స్ 100 అయితే రెండున్నర కోట్లతో తయారై సూపర్ డూపర్ లాభాలు తెచ్చుకుంది. ఆ రేంజ్ లాభాలు గూఢచారికి కూడా ఇంపాజిబుల్.
మరి ఇవన్నీ ఇలా వుంటే మూడు సినిమాలే అని నాగార్జున స్టేట్ మెంట్ పడేయడం ఏమిటో? ఎంత తన మేనగోడలు చిన్న పాత్రలో కనిపించి విజయం సాధించింది అన్న ఆనందం వున్నా, అసలు సంగతులు మరిచిపోతే ఎలా?