cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

దీపావళికి 'ముద్ర'

దీపావళికి 'ముద్ర'

నిఖిల్-టాగోర్ మధు కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా ముద్ర. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం నేపథ్యంలో తయారవుతున్న ఈ సినిమా విడుదలకు డేట్ ఫిక్స్ చేసేసారు. దీపావళి సందర్భంగా నవంబర్ 8న విడదుల చేయాలని డిసైడ్ అయ్యారు. టిఎన్ సంతోష్ డైరెక్ట్ చేస్తున్నఈ సినిమాలో లావణ్య తిపాఠీ కథానాయిక.

తమిళ సినిమా లైన్ తీసుకుని, కొత్త స్క్రిప్ట్ తయారుచేసి రూపొందింస్తున్న ఈ సినిమా ఇప్పటికి 70శాతం వర్క్ పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ తో వర్క్ పూర్తవుతుంది. అయితే సరైన డేట్ లు అందుబాటులో లేకపోవడం వల్ల, పర్ ఫెక్ట్ గా పోస్ట్ ప్రొడక్షన్ ఫినిష్ చేసుకుని నవంబర్ 8న విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు.

నిఖిల్ ఈ సినిమా మీద చాలా కేర్ తీసుకుంటున్నాడు. సినిమా స్క్రిప్ట్ మొత్తం తమిళ సినిమాను పక్కనపెట్టి రెడీ చేయించడమే కాకుండా, డైలాగ్ వెర్షన్ మొత్తాన్ని యంగ్ డైరక్టర్ కమ్ రైటర్ కృష్ణ చైతన్య చేత తయారుచేయించారు. సినిమా ప్రొడక్షన్ లో వుండగానే శాటిలైట్, డిజిటల్, హిందీ డబ్బింగ్ హక్కులతో పాటు, టోటల్ థియేటర్ రైట్స్ అవుట్ రేట్ గా అమ్ముడుపోవడం విశేషం.