7న మూడు జోనర్లు.. మూడు సినిమాలు

మొన్నటికి మొన్న ఆగస్టు 3న మూడు సినిమాలు ఢీకొన్నాయి. మళ్లీ సెప్టెంబర్ 7 అలాంటి సీన్ నే రిపీట్ అవుతోంది. ఆ రోజున మూడు సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. అయితే ఈసారి మూడు…

మొన్నటికి మొన్న ఆగస్టు 3న మూడు సినిమాలు ఢీకొన్నాయి. మళ్లీ సెప్టెంబర్ 7 అలాంటి సీన్ నే రిపీట్ అవుతోంది. ఆ రోజున మూడు సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. అయితే ఈసారి మూడు జోనర్లకు చెందిన మూడు సినిమాలు కావడం విశేషం. మాస్ డైరక్టర్ సంపత్ నంది పర్యవేక్షణలో తయారైన మీడియం సినిమా పేపర్ బాయ్. ఇంజనీరింగ్ గ్రాడ్యయేట్ కుర్రాడికి, ప్రొఫెసర్ కూతురుకు మధ్య నెలకొన్న ప్రేమ, కుర్రాళ్ల ఎమోషన్లు, దేశంలోని వివిధ ఇంట్రెస్టింగ్ లోకేషన్లలో రోమింగ్ రొమాంటిక్ మూవీగా తయారైంది ఈ సినిమా.

రొమాంటిక్ లైన్ కు యూత్ ఫుల్ ఫన్ జోడించారు. సంతోష్ శోభన్ హీరో. మీడియం సినిమా అయినా ఖర్చు కాస్త బాగానే పెట్టిన సినిమా ఇది. నరసింహా, రాములు, వెంకట్ లతో పాటు సంపత్ నంది కూడా నిర్మాణ భాగస్వామి. అల్లరి నరేష్-సునీల్ కాంబినేషన్ లో దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు అందిస్తున్న సినిమా సిల్లీ ఫెలోస్. భరత్ చౌదరి,  కిరణ్ రెడ్డి, వివేక్ కూచిభొట్ల నిర్మాతలు. తమిళ సినిమా ఆధారంగా తయారవుతున్న ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ జోనర్ లో సాగుతుంది.

ఈ రెండు సినిమాలతో పాటు కేరాఫ్ కంచరపాలెం అనే సినిమా కూడా విడుదలవుతోంది. విశాఖపట్నంలోని కంచరపాలెం ఏరియా బ్యాక్ డ్రాప్ లో తయారైన సినిమా ఇది. ఇప్పటికి మూడు సినిమాలు దాదాపు ఖరారైనట్లు బోగట్టా. మరి ఇంకా ఎన్ని సినిమాలు తోడవుతాయో చూడాలి.

ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్లు నిర్వాణ సినిమాస్ నిర్మించిన మను సినిమా కూడా ఇదే డెట్ కు విడుదల చేసే ఆలోచనలో వున్నారు.