శైలజారెడ్డి అల్లుడు మరో ఇరవై రోజుల్లో విడుదలకు రెడీ అవుతోంది. ఒక పక్క సినిమా పూర్తయిపోయి, పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఆల్ మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ కు వచ్చింది. అయితే ఒక పాటను ఆది నుంచీ వెనక్కు పెట్టారు. చివరన టైమ్ చూసుకుని చేద్దాం అనే ఆలోచనతో. ఇప్పుడు సినిమా దాదాపు ఫినిష్ అయిపోయింది కాబట్టి, ఆ పాట మీదకు వచ్చారు.
ఈ పాట ట్యూన్, లిరిక్స్ రెడీ చేసారు. రికార్డింగ్ కు ఏర్పాటు చేస్తున్నారు. అదే సమయంలో ఈ పాటను షూట్ చేయడానికి గోవాను లొకేషన్ గా ఎంచుకున్నారు. ముందుగా క్రాబ్స్ ఐలాండ్ ను మాంచి స్పాట్ గా ఎంచుకున్నారు. కానీ టైమ్ సరిపోతుందో లేదో? లాస్ట్ మినిట్ టెన్షన్ ఎందుకు అని గోవాతో సరిపెట్టేసుకుంటున్నారు.
ఈ పాటను ఈ మండే నుంచి స్టార్ట్ చేసి మూడురోజుల్లో ఫినిష్ చేస్తారు. ఈనెల 10 నుంచి ఒక్కో సాంగ్ వన్ మినిట్ టీజర్లు, అలాగే దగ్గర చేసి ట్రయిలర్, ఇంకా విడుదల దగ్గరగా మేకింగ్ వీడియో, ఈ టైమ్ లోనే ప్రీ రిలీజ్ ఫంక్షన్ లాంటి హడావుడులు వుంటాయి.
శైలజారెడ్డి అల్లుడుకు పోటీగా ఓ రోజు ముందుగా నాగశౌర్య @నర్తనశాల విడదులవుతోంది. దానికి పబ్లిసిటీ ఓ రేంజ్ లో బీభత్సంగా చేస్తున్నారు. అందుకే శైలజారెడ్డిఅల్లుడు పబ్లిసిటీని కూడా తానే ప్లాన్ చేసి, ఎగ్జిక్యూట్ చేయాలని దర్శకుడు మారుతి ఆలోచిస్తున్నారు.