అ..ఆ సినిమాతో నలభై కోట్ల హీరో అయ్యాడు నితిన్. కానీ లై సినిమా అంతకు అంతా దెబ్బతీసింది. అది కూడా నలభై కోట్ల సినిమానే కానీ, విజయం సాధించలేకపోవడంతో సమస్యగా మిగిలింది. ఆ తరువాత చల్ మోహన్ రంగ కూడా ఫరవాలేదనే రేంజ్ లో బిజినెస్ చేసింది. కానీ యావరేజ్ గా మిగిలింది. ఇప్పుడు మళ్లీ ముఫైకోట్ల రేంజ్ బిజినెస్ తో శ్రీనివాస కళ్యాణం నితిన్ కెరీర్ కు ఊపిరి ఊదింది.
దాదాపు పాతిక కోట్లకు ఫైగా థియేటర్ బిజినెస్ చేసిందీ సినిమా. ఇక శాటిలైట్ డిజిటల్ సంగతి సరేసరి. ఆంధ్రను పదికోట్ల రేంజ్ లో ఎంజి లెక్కన అందించారు. సీడెడ్ నాలుగు కోట్లకు ఇచ్చారు. నైజాం దిల్ రాజుదే. ఆరేడు కోట్లు అంచనా వేసుకున్నారు లెక్కల కోసం. ఓవర్ సీస్ మూడు కోట్లు. ఇలా మొత్తంమీద పాతిక కోట్లకు పైగా థియేటర్ రైట్స్ రావడం విశేషం.
సినిమాకు 16 నుంచి 17కోట్ల వరకు ఖర్చయింది. అందువల్ల పిచ్చ ప్రాఫిట్ అన్నమాట. ఇక సినిమా దిల్ రాజు అనుకున్న రేంజ్ కు హిట్ అయితే, మరీనూ. ఈ సినిమా తరువాత నితిన్ హారిక హాసిని బ్యానర్ లో సినిమా చేస్తున్నాడు. ఛలో సినిమా అందించిన వెంకీ కుడుమల డైరక్టర్.