ఆ డైరక్టర్ పై హీరోకి కోపం!

ఒక్కో సినిమా సెట్ కావడం వెనుక చాలా కథలుంటాయి. కొండకచో రికమెండేషన్లూ వుంటాయి. హీరో బలంగా నమ్మిన వారు చెబితే కథ వినడాలు ఓకె చెప్పడం వంటి వ్యవహారాలు నడుస్తంటాయి టాలీవుడ్ లో. ఇప్పుడు…

ఒక్కో సినిమా సెట్ కావడం వెనుక చాలా కథలుంటాయి. కొండకచో రికమెండేషన్లూ వుంటాయి. హీరో బలంగా నమ్మిన వారు చెబితే కథ వినడాలు ఓకె చెప్పడం వంటి వ్యవహారాలు నడుస్తంటాయి టాలీవుడ్ లో. ఇప్పుడు అలా సెట్ అయిన ఓ సినిమా కు సంబంధించి తనకు రికమెండ్ చేసిన వ్యక్తిపై హీరో మండి పడుతున్నట్లు తెలుస్తోంది.

ఓ హీరోకి ఓ దర్శకుడిని పరిచయం చేసి, కథ వినేలా చేసాడో పెద్ద దర్శకుడు. ఆ హీరోతో ఆ మాత్రం సాన్నిహిత్యం వుంది కనుక, ప్రాజెక్ట్ ఓకె అయిపోయింది. సినిమా విడుదలయింది. ఈ వ్యవహారంలో కాస్త లాయల్టీ లాంటివి నిర్మాత నుంచి సదరు పెద్ద దర్శకుడికి ముట్టిందని గ్యాసిప్ కూడా వుంది. 

కానీ సినిమా విడుదల తరువాత మిక్స్ డ్ టాక్ రావడంతో సదరు హీరో ఆ డైరక్టర్ అంటే అసంతృప్తిగా వున్నట్లు తెలుస్తోంది. ఈ అసంతృప్తి, కోపాన్ని ఇటీవల సదరు దర్శకుడి దగ్గర బాహాటంగానే వ్యక్త పరిచినట్లు తెలుస్తోంది. 'నువ్వే కదా. ఈ ప్రాజెక్టు సిఫార్సు చేసింది..' అంటూ మొదలు పెట్టి వరుసగా సెటైర్లు వేసినట్లు బోగట్టా. 

ఇదిలా వుంటే ఇదే దర్శకుడు మరో పెద్ద హీరోకి కూడా మరో మిడ్ రేంజ్ దర్శకుడిని పరిచయం చేసి ఒక ప్రాజెక్టు సెట్ చేసారు. ఇప్పుడు అది కూడా అటు ఇటు ఊగుతోందని తెలుస్తోంది. అయినా ఈ లయిజినింగ్ లు ఎందుకో? హాయిగా మంచి సినిమాలు చేసుకోవడం మానేసి.