పులివెందులలో అడుగు పెట్టిన చంద్రబాబు రెచ్చిపోయారు. కుప్పంలో తనను గెలుకుతున్న వైఎస్ జగన్‌ను రాజకీయంగా, మానసికంగా ఇరిటేట్ చేసేందుకు చంద్రబాబు ఉత్సాహం చూపారు. పులివెందులలో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ తనను తాను సింహమని అభివర్ణించుకోవడం విశేషం.
“నేను ఎప్పుడూ కొదమ సింహాన్నే. నాతో మర్యాదగా వుంటే నేనూ అలాగే వుంటాను. తక్కువ అంచనా వేసినా, రెచ్చగొట్టినా కొదమ సింహంలా విరుచుకుపడి అణచివేస్తాను” అని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుప్పం సింహం, పులి అని చంద్రబాబును ఉద్దేశించి ఎవరైనా అంటే సబబుగా వుంటుంది. తన గురించి తానే గొప్పలు చెప్పుకోవడం చంద్రబాబుకే చెల్లింది. చంద్రబాబు పులో, సింహమే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి బాగా తెలుసు.
పులివెందులలో చంద్రబాబు గర్జించాడని రామోజీరావు పత్రిక రాయడంపై నెటిజన్లు సెటైర్స్ విసురుతున్నారు. అసెంబ్లీలో తన భార్యను ఎవరో ఏదో అన్నారని బాబు వెక్కివెక్కి ఏడ్చే వీడియోలను ప్రదర్శిస్తూ… ఇదేనా గర్జన అని రామోజీని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల ముందు ప్రధాని మోదీని తిట్టిన చంద్రబాబు, ఆ తర్వాత ఓడిపోయాక “మ్యావ్ మ్యావ్” అంటూ ప్రశంసించడాన్ని తెరపై చూపుతూ… సింహం గర్జిస్తోందని వెటకరిస్తున్నారు.
పచ్చి రాజకీయ అవకాశ వాది అయిన చంద్రబాబు.. ఆయా సందర్భాలను అనుసరించి నడుచుకుంటుంటారని, ఒకప్పుడు సోనియా, రాహుల్‌ను తిట్టిన నోటితోనే ప్రశంసించడాన్ని గుర్తు చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని, వారితో చెట్టపట్టాలేసుకుని తిరగడాన్ని సోషల్ మీడియాతో వైరల్ చేస్తున్నారు. ఇవన్నీ సింహం, పులులు చేసే పనులే అంటూ చంద్రబాబును చితక్కొడుతున్నారు.
అయ్యా చంద్రబాబు మీరు సింహం అంటే అడవి రారాజు అయిన ఆ జంతువు సిగ్గుపడుతుందని నెటిజన్లు దెప్పి పొడుస్తున్నారు. సింహం, పులి లాంటి వాటితో మీకెందుకయ్యా పోలిక… హాయిగా వెన్నుపోటు పేటెంట్దారుడిగా జీవితాన్ని గడపకుండా అని వెటకరించడం విశేషం.