సెంటిమెంట్లు లేనివాళ్లు అరుదుగా వుంటారు. ముఖ్యంగా పేకాట, సినిమాలు, క్రికెట్ ఇలాంటి వాటిలో సెంటిమెంట్లు చాలా ఎక్కువ వుంటాయి. సినిమా వాళ్లకు సెంటిమెంట్లు మరీ ఎక్కువ. విడుదలకు ముందు తమ ఇష్టదైవాల ఆలయాలకు వెళ్లడం, లక్కీ హ్యాండ్ అన్నవారిచేత ఫస్ట్ టికెట్ కొనిపించడం, ఇలా చాలారకాలు వున్నాయి. నిర్మాత దిల్ రాజుకు ఒకటి కాదు రెండుకాదు చాలా సెంటిమెంట్లు వున్నాయట. ఆయన వెంకన్న భక్తుడు.
ప్రతి సినిమా విడుదల ముందు తిరుపతి వెళ్తుంటారు. అది అందరికీ తెలిసిందే. అలాగే సినిమా విడుదల దగ్గరకు వచ్చేసిన తరువాత పనులు ఫినిష్ చేసుకుని రెండుమూడు రోజులు గాయబ్ అయిపోతారట. ఎక్కడికి వెళ్తారు అనుకున్నారు. అమెరికానో? సింగపూర్? నో. ఇలా ఏదో దేశానికి. అక్కడకు వెళ్లి ఏం చేస్తారు? అన్ని వ్యవహారాలు పక్కనపెట్టి, ఫోన్ లు కూడా ఆన్సర్ చేయకుండా, హ్యాపీగా కేసినోల్లో చిన్న చిన్న పందాలు కాసుకుంటూ గడిపేస్తారట.
దిల్ రాజుకు వున్న ఏకైక వీక్ నెస్ అదేనట. నాకు అది రిలాక్స్ ఇస్తుంది. సినిమా టెన్షన్ నుంచి కాస్త దూరం చేస్తుంది అంటారట. ఇప్పుడు కూడా గత రెండు మూడు రోజులు అలాగే సింగపూర్ లో హ్యాపీగా గడిపేసారట. శ్రీనివాస కళ్యాణం పనులు అన్నీ ఫినిష్ చేసి, ఛలో కేసినో అంటూ వెళ్లిపోయారని తెలుస్తోంది. అక్కడ రిలాక్స్ సరే, ఇంతకీ లాభమో? నష్టమో? చెప్పేదెవరు?
వచ్చేసి, ఇక ఈ నాలుగు రోజలు మాత్రం శ్రీనివాస కళ్యాణం గురించి పట్టించుకుంటారన్న మాట. నితిన్, రాశీఖన్నాలతో సతీష్ వేగ్నిశ డైరక్షన్ లో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా గురువారం విడుదల కాబోతోంది.