శైలజా… అల్లుడా?

ఓ సినిమాకు టీజర్, ట్రయిలర్ కట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. సినిమా గురించి లీడ్ ఇచ్చేది, జనాలను లీడ్ చేసేది అదే. సినిమా జోనర్ ఏమిటి? ఎలా వుండబోతోంది అన్నది కాస్త…

ఓ సినిమాకు టీజర్, ట్రయిలర్ కట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. సినిమా గురించి లీడ్ ఇచ్చేది, జనాలను లీడ్ చేసేది అదే. సినిమా జోనర్ ఏమిటి? ఎలా వుండబోతోంది అన్నది కాస్త ఐడియా ఇచ్చేది ఇదే. ఆగస్టు 31న విడుదల కాబోతున్న శైలజారెడ్డి అల్లుడు సినిమా టీజర్ ఆగస్టు 1న రాబోతోంది. ఇప్పటి వరకు శైలజారెడ్డి అల్లుడు సినిమాకు మాంచి బజ్ నే వచ్చింది. అయితే సినిమా లైన్ ఏమిటి అన్నదాని మీద క్లారిటీ లేదు.

ఇప్పటి వరకు వచ్చిన సవాలక్ష అత్త అల్లుడు సినిమాల మాదిరిగానే అత్త అల్లుళ్ల సవాల్ గా వుంటుందని జనం అనుకుంటున్నారు. కానీ ఆ రోటీన్ పాయింట్ కాకుండా కొత్త పాయింట్ తో వెళ్తున్నారు దర్శకుడు మారుతి. ఆ పాయింట్ ఏమిటన్నది చెప్పేది టీజర్ నే.

సినిమాలో మూడు క్యారెక్టర్లు కీలకం. అత్త, అల్లుడు, అమ్మడు. ఈ ముగ్గురిని టచ్ చేస్తూ టీజర్ కట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అత్త గోరోజనం.. అమ్మడు ఇగోయిజం.. అల్లుడి అసహాయత అన్నీ కలిసి టీజర్ వుండే అవకాశం వుంది. టీజర్ లో ఏవివున్నా, ఏవి లేకపోయినా, అత్త రమ్యకృష్ణ దర్పం.. అల్లుడు చైతూ స్టయిల్ మాత్రం కచ్చితంగా వుంటాయనే అనుకోవాలి.