‘అరవింద’లో జాలి/జోల పాట

దర్శకుడు త్రివిక్రమ్ సినిమా రూపొందిస్తున్నారు అంటే ఎంతో ఆసక్తి వుంటుంది. అందునా ఎన్టీఆర్ లాంటి హీరో అంటే మరీనూ. జనాలకు ఆ సినిమా ఏమిటో? కథ, కమామిషు ఏమిటో అని ఒకటే ఆసక్తిగా వుంటుంది.…

దర్శకుడు త్రివిక్రమ్ సినిమా రూపొందిస్తున్నారు అంటే ఎంతో ఆసక్తి వుంటుంది. అందునా ఎన్టీఆర్ లాంటి హీరో అంటే మరీనూ. జనాలకు ఆ సినిమా ఏమిటో? కథ, కమామిషు ఏమిటో అని ఒకటే ఆసక్తిగా వుంటుంది. అందుకే త్రివిక్రమ్ లేటేస్ట్ సినిమా అరవింద సమేత వీర రాఘవలో విషయాలు తరచు ఎక్కడో అక్కడ ‘ట’ బోగట్టాలుగా వినిపిస్తూనే వుంటాయి.

అరవింద సమేత సినిమా ఆరంభంలోనే ఓ జాలి కమ్ జోల పాట లాంటిది వుంటుందని తెలుస్తోంది. ఇది ఓ తల్లి పిల్లాడికి జోల పాటగా పాడుతుందట. ‘పెనిమిటీ.. ఓ పెనిమిటీ’ అనే టైపులో. అయితే భాష తెలియని వయసులో పిల్లాడు జోలపాటే అనుకుంటాడు. కానీ తెలిసిన తరువాత అర్థం అవుతుంది. అది తల్లి జాలి పాట అని. ఆమె తన భర్త కోసం పాడుతోందని. అన్నట్లు ఈ పాటను థమన్ సూపర్ గా ట్యూన్ చేసాడని కూడా తెలుస్తోంది.

అంటే ఇదంతా ఏదో రివెంజ్ స్టోరీకి దారితీసేలాగే కనిపిస్తోంది. అన్నట్లు సినిమా ఆరంభంలోనే భారీ ఎపిసోడ్ కూడా ఏదో వుంటుందని వినిపిస్తోంది. అక్టోబర్ 11 లేదా 12న విడుదలయ్యే అరవింద సమేత సినిమా మీద మంచి అంచనాలు వున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.